ETV Bharat / state

దేవరకద్ర ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

author img

By

Published : Dec 7, 2020, 1:19 PM IST

Updated : Dec 7, 2020, 6:21 PM IST

Corona positive for Devarakadra MLA today tested at bhuthpur phc
దేవరకద్ర ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి కరోనా పాజిటివ్​గా వచ్చింది. భూత్పూర్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష నిర్వహించగా వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గతవారం తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడ్డాడు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. భూత్పూర్​ పీహెచ్​సీలో నిర్వహించిన పరీక్షల్లో వైరస్​ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారం నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

నియోజకవర్గంలో పలు అభివద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉండగా అన్నింటిని రద్దు చేసుకున్నారు. తాను హాజరు కావాల్సిన పనులన్నీంటిని స్థానిక ప్రజాపతినిధులకు అప్పగించారు. జిల్లా కలెక్టరేట్​లో జరిగే ఆయకట్టు రైతుల సమావేశంలో నియోజకవర్గ రైతులు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చూడండి:తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు

Last Updated :Dec 7, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.