ETV Bharat / state

పార్లమెంట్‌లో జీవో 317 అంశాన్ని ప్రస్తావిస్తా: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Jan 29, 2022, 3:16 PM IST

Revanth Reddy on GO 317
మహబూబాబాద్​ జిల్లా వార్తలు

Revanth Reddy on GO 317: బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్​ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్​ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పరామర్శించారు. జీవో 317 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పర్వతగిరిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు సంపత్​ కుటుంబాన్ని పరామర్శించారు.

Revanth Reddy on GO 317: ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా సంధ్యతండాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఇటీవల గుండెపోటుతో చనిపోయిన ఉపాధ్యాయుడు జేత్రామ్‌ కుటుంబాన్ని పరామర్శించారు.

బదిలీల్లో భాగంగా మనస్తాపం చెందిన జేత్రామ్.. ప్రాణాలు కోల్పోయారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 వల్ల స్థానికతపై గందరగోళం నెలకొందన్నారు. కావాలానే తెరాస, భాజపా సమస్యను జటిలం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో జీవో 317 అంశంపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలమంతా ప్రస్తావిస్తామని వెల్లడించారు.

పోలీసులను నమ్ముకుని పరిపాలన చేస్తున్నారు: రేవంత్​ రెడ్డి

"ఓట్లేసిన ప్రజలను నమ్ముకుని కాకుండా.. పోలీసులను నమ్ముకుని తెరాస ప్రభుత్వం పరిపాలన చేస్తోంది. జీవో 317 ప్రవేశపెట్టి.. ఉపాధ్యాయ ఉద్యోగులను వేరే వేరే జిల్లాలకు బదిలీలు చేసి వారికి స్థానికత అనేది లేకుండా చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేసి వ్యవహరిస్తున్నాయి. జీవో 317పై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావన తెస్తా. అసెంబ్లీలో ఈ సమస్యపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పోరాడతారు." -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

అనంతరం పర్వతగిరిలో రేవంత్​ రెడ్డి పర్యటించారు. పంట నష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన మిరప రైతు సంపత్​ కుటుంటాన్ని రేవంత్​ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సాయం చేశారు.

ఇదీ చదవండి: Bandi Sanjay Comments on CM KCR : 'కేసీఆర్ డైరెక్షన్​లోనే భాజపా నాయకులపై దాడులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.