ETV Bharat / state

మాటూరు వాగు సమీపాన కోతకు గురైన రహదారి.. రాకపోకలకు అంతరాయం

author img

By

Published : Sep 28, 2020, 11:50 AM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు వాగు సమీపాన ఉన్న రహదారి కోతకు గురైంది. ఫలితంగాఈ మార్గం నుంచి ఏపీలోని గంపలగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి.

road beside  maturi vagu has damaged in khammam district
మాటూరు వాగు సమీపాన కోతకు గురైన రహదారి

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు వాగు పైవంతెన సమీపాన ఉన్న రహదారి.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. మాటూరు నుంచి ఆంధ్రప్రదేశ్​లోని గంపలగూడెం మండలంలోని పలు గ్రామాలకు నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రహదారి కోతకు గురవడం వల్ల ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి.

కోతకు గురైన రహదారి వద్ద తరచూ ప్రమాదాలు జరిగేవని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.