ETV Bharat / state

Congress Khammam sabha : 'ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభ'

author img

By

Published : Jun 28, 2023, 7:21 PM IST

Manik Rao Thackeray
Manik Rao Thackeray

Manik Rao Thackeray On Khammam Sabha : ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్​ బహిరంగ సభలోనే పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి.. కాంగ్రెస్​లో చేరతారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రకటించారు. అదే సభలో భట్టి విక్రమార్క పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాహుల్​ గాంధీతో ఘన సన్మానం ఉంటుందని స్పష్టం చేశారు. కోదాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి ఆయన పాల్గొన్నారు.

Ponguleti will join in Khammam Sabha : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు.. బహిరంగ సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. పాదయాత్ర ముగింపు సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారని.. ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిల్లగూడెం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏఐసీసీ నిర్దేశించిన మార్గదర్శకం మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని మాణిక్​రావు ఠాక్రే అన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకువెళ్లడంలో భట్టి సఫలీకృతమయ్యారని తెలిపారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని వివరించారు.

"జులై 2 న ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జనగర్జన సభలో రాహుల్​ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్​ కాంగ్రెస్​లో చేరతారు. అదే సభలో భట్టి విక్రమార్క పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయనను రాహుల్​ గాంధీ సన్మానిస్తారు. లక్షమందితో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది." - మాణిక్​ రావు ఠాక్రే, కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇంఛార్జి

Manik Rao Thackeray Comments On Bhatti People March : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర, ఏఐసీసీ దిశా నిర్దేశం ప్రకారంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేశారని మాణిక్​ రావు ఠాక్రే తెలిపారు. ఈ యాత్రలు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు కొనసాగిన పాదయాత్రలో ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం పాల్గొన్నారన్నారు.

మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జులై 02న నిర్వహించే.. తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు, పాదయాత్ర ముగింపు నిర్వహణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి కోఆర్డినేషన్ చేస్తారని ఆయన చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు, కాంగ్రెస్​ శ్రేణులు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారని మాణిక్​ రావు ఠాక్రే వివరణ ఇచ్చారు.

ఖమ్మంలో లక్షమందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.