ETV Bharat / state

Rahul Gandhi comments to Congress leaders : 'కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు'

author img

By

Published : Jun 27, 2023, 4:13 PM IST

Updated : Jun 27, 2023, 5:08 PM IST

Rahul Gandhi
Rahul Gandhi

16:05 June 27

Rahul Gandhi comments to Congress leaders : 'కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు'

Rahul Gandhi fires on Telangana Congress leaders : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని అన్నారు. పార్టీ గురించి ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడవద్దని నేతలకు సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విభేదాలుంటే రాష్ట్ర ఇన్‌ఛార్జ్, లేదా తనతో మాట్లాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పునరుద్ఘాటించారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.

కర్నాటకలో ఘనవిజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. తమ దృష్టిని ఇప్పుడు పూర్తిగా తెలంగాణపైనే కేంద్రీకరించింది. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని.. ఆ పార్టీలో అంతర్గత పోరు తనకు లాభిస్తుందని హస్తం నేతలు ఆశాభావంతో ఉన్నారు. దీనికి తోడు కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసింది. ఇతర పార్టీల్లో అసంతృప్తులను తనవైపు లాక్కునేలా వ్యూహరచన ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కీలక నేతలయిన పొంగులేటి, జూపల్లిని తన పార్టీలోకి వచ్చేలా చేసి విజయం సాధించింది.

దిల్లీలో గత 2 రోజులుగా టీ కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతున్న రాహుల్ గాంధీ.. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. పార్టీలో పదవులు, వచ్చే ఎన్నికల వ్యూహాలు, టికెట్లు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇలా ప్రతి అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఐక్యంగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రత్యేకంగా సూచించారు. ప్రతి ఒక్క నేతతో మాట్లాడిన రాహుల్.. వారు ఇచ్చిన సలహాలను నోట్ చేసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తావివ్వకూడదని.. తెలంగాణలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని.. నేతలను సుతిమెత్తగా హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 27, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.