ETV Bharat / state

Cotton Farmers Problems Due To Late Rains : వర్షాల లేక అన్నదాతలపై అదనపు భారం

author img

By

Published : Jul 8, 2023, 9:20 AM IST

Delay In Rains in Telangana : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతకు వానాకాలం పరీక్ష పెడుతోంది. తొలకరి పలకరింపుతో కొండంత ఆశతో సాగు మొదలు పెట్టిన కర్షకులపై వరుణదేవుడు కరుణ చూపడం లేదు. సీజన్ అనుకూలంగా ఉందన్న భరోసాతో తొలకరికే విత్తనాలు నాటిన రైతులు.. తర్వాత ఆశించిన మేర వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ సాగునే నమ్ముకున్న అన్నదాతలు..మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట కొన్నిచోట్ల రెండోసారి, మరికొన్ని చోట్ల మూడోసారి మళ్లీ విత్తనాలు వేస్తున్నారు.

rains
rains

వర్షాల లేక అన్నదాతలపై అదనపు భారం

Late Monsoon Rains in Telangana : ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. భద్రాద్రి జిల్లాలో ఈ సీజన్​లో అన్నిపంటలు కలిపి 6,02,116 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి 2,14,302 ఎకరాలు, 1,65,025 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు పత్తి కేవలం 45,972 ఎకరాల్లోనే సాగైంది. 5057 ఎకరాల్లో వరి సాగుచేశారు. మొక్కజొన్న 4945 ఎకరాల్లో సాగైంది. మొత్తం 91,071 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.

ఖమ్మం జిల్లాలో అన్ని పంటలు కలిపి 6,50,000 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు 1,43,890 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. వరి 2,89,893ఎకరాలు, పత్తి 2,23,617 ఎకరాలు, మిర్చి 80,000 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటివరకు 50,704 ఎకరాల్లో వరి, 87,985 ఎకరాల్లో పత్తి, పెసర 4,443 ఎకరాలు, మొక్కజొన్న 326 ఎకరాల్లో సాగయ్యాయి. అసలే తొలకరి ఆలస్యంగా పలకరించడం, విత్తనాలు ఆలస్యంగా నాటడంతో పత్తి సాగుపై కొంత ప్రతికూల ప్రభావం ఏర్పడింది.

"వర్షాలు మొదలవుతాయని విత్తనాలు వేశాము. కానీ అనుకున్నట్లు వర్షాలు కురవలేదు. మొదటిసారి ఒక్క ఎకరానికి దాదాపు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మళ్లీ విత్తనాలు వేస్తున్నాం పెట్టుబడులు పెట్టాలి అంటే అప్పులే దిక్కు."-బాధిత రైతులు

ఇప్పుడు వాణిజ్య పంటగా పేరు గాంచిన పత్తి సాగు ఇప్పుడు సాగుదారుకు పరీక్ష పెడుతోంది. మే నెలాఖరు నుంచే రైతులు పత్తి విత్తనాలు నాటారు. జూన్​లో తొలకరి పలకరింపుతో విత్తనాలు ఎక్కువగా వేశారు. కానీ ఆ తర్వాత ఆశించిన వర్షాలు రాక విత్తనం మొలకెత్తలేదు. పొడు దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటడం, వానలు లేక, తడి అందక విత్తనం మొలకెత్తలేదు. 30-40 శాతమే విత్తనం భూమి నుంచి బయటకు వచ్చింది.

రెండు జిల్లాల్లో కలిపి 1,33,957ఎకరాల్లో పత్తి సాగు చేస్తే.. దాదాపు 85,000 ఎకరాల్లో పత్తి విత్తనం మొలకెత్తని పరిస్థితి ఉంది. దీంతో.. రైతులు మళ్లీ అదే స్థానంలో మరోసారి విత్తనాలు నాటుతున్నారు. దీంతో అన్నదాతలకు అదనపు భారం తప్పడం లేదు. వాస్తవానికి ఎకరాకు విత్తనం నాటేందుకు రైతుకు సుమారు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.4,000 ఖర్చు చేయాలి.

కొంతమంది రైతులు రెండుసార్లు దుక్కులు దున్నుతారు. ఇలా చేసిన వారికి రెట్టింపు ఖర్చుఅవుతుంది. మూడోసారి విత్తనం పెట్టిన వారిపై రూ.30,000 అదనపు భారం తప్పడం లేదు. అంతేకాదు..ఒకటి రెండుసార్లు విత్తనం వేయడం వల్ల మొక్కల చుట్టూ పిచ్చి గడ్డి గడ్డి మొలుస్తుంది. ఇది తొలగించడానికి మళ్లీ అన్నదాతలకు అదనపు ఖర్చు తప్పని పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.