ETV Bharat / state

ప్లాస్మా ఇచ్చి ప్రాణం నిలబెట్టిన హోంగార్డు

author img

By

Published : Aug 26, 2020, 5:13 PM IST

ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడాడు ఓ హోంగార్డు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్​... కరోనా రోగికి ప్లాస్మాదానం చేసి ఊపిరి నిలిపాడు.

ప్లాస్మా ఇచ్చి ప్రాణం నిలబెట్టిన హోంగార్డు
ప్లాస్మా ఇచ్చి ప్రాణం నిలబెట్టిన హోంగార్డు

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్‌పై ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న కరీంనగర్​ జిల్లా జమ్మికుంట ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్​... హైదరాబాద్​ వచ్చి ఆరోగికి ప్మాస్మా దానం చేసి ప్రాణం నిలబెట్టాడు.

ఈ సందర్భంగా జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డి, ఎస్సై ప్రవీణ్‌రాజ్‌, ఇతర పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌ను అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.