ETV Bharat / state

లవ్​ ఫెయిల్​ అంటూ బైక్​పై అతివేగం.. గాల్లో ప్రాణాలు

author img

By

Published : Feb 17, 2020, 4:58 PM IST

లవ్​ ఫేయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు.. అనంతలోకాలకు వెళ్లాడు
లవ్​ ఫేయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు.. అనంతలోకాలకు వెళ్లాడు

లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా బైక్​ నడుపుతూ వాట్సాప్​ స్టేటస్​ పెట్టాడు. అదే చివరి స్టేటస్​ అవుతుందని ఊహించలేదు. ఇంతలో ఆటో ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

లవ్​ ఫెయిల్​ అంటూ అతివేగంగా నడిపాడు.. అనంతలోకాలకు వెళ్లాడు

కామారెడ్డి జిల్లా ఉగ్రవాయిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ అనే 19 ఏళ్ల యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు గంట ముందు తన వాట్సాప్ స్టేటస్​లో లవ్ ఫెయిల్ అంటూ వీడియో పెట్టి బైక్​ను అతి వేగంగా నడిపాడు. తన వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చూడండి: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.