ETV Bharat / state

BRS Athmeeya Sammelanam at Station Ghanpur : సిద్దిపేట తర్వాత నాకు స్టేషన్​ ఘన్​పూర్ కార్యకర్తలంటేనే ఇష్టం : హరీశ్​రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 6:38 PM IST

Updated : Oct 28, 2023, 7:53 PM IST

harishrao
BRS Atmiya Sammelanam at Station Ghanpur

BRS Athmeeya Sammelanam at Station Ghanpur : రాష్ట్రంలో స్టేషన్​ ఘన్​పూర్..​ గులాబీ కోటకు కంచుకోట లాంటిదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట తర్వాత తనకు ఇష్టమైన కార్యకర్తలు ఇక్కడే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్​ ఘన్​పూర్​లో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు.. అనంతరం ప్రసంగించారు.

BRS Athmeeya Sammelanam at Station Ghanpur : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారాన్ని(BRS Election Campagin) ముమ్మరం చేసింది. ఒకవైపు ఆశీర్వాద సభలతో సీఎం కేసీఆర్​ వరుస పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు ఆత్మీయ సమావేశాలతో హరీశ్​రావు, కేటీఆర్​ నియోజకవర్గాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని స్టేషన్​ ఘన్​పూర్​లో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనం(BRS Public Meeting)లో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు.. అనంతరం ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా.. స్టేషన్​ ఘన్​పూర్​ గులాబీ కోటకు కంచుకోట అంటూ కొనియాడారు. ఇంకా కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సిద్దిపేట తర్వాత తనకు ఇష్టమైన కార్యకర్తలు స్టేషన్​ ఘన్​పూర్​లోనే ఉన్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్​ రెడ్డి అని.. రూ.50 కోట్లు పెట్టి ఆయన టీపీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలే చెప్పారని ఆరోపించారు. అలాగే రేవంత్​ రెడ్డి కోట్ల రూపాయలకు టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్​ నేతలే అంటున్నారన్నారు. సగం స్థానాల్లో బీజేపీ​ పార్టీకి నేతలే లేరని.. ఇతర పార్టీ నేతల వైపు చూస్తున్నారని వివరించారు. కేసీఆర్​పై పోటీ చేస్తా అంటున్న వారిలో కొందరు.. గతంలో వాళ్ల సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేదని ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని.. కేసీఆర్​ అంటేనే ఒక భరోసా అంటూ స్పష్టం చేశారు.

"కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి 100 టికెట్లు.. 101 ధర్నాలు అవుతున్నాయి. గాంధీభవన్​లో చొప్పుకొలేని పరిస్థితి ఉంది. అది ఈరోజు తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్​ రెడ్డి. రూ.50 కోట్లను పెట్టి పీసీసీ అధ్యక్షుడి పదవిని కొనుక్కున్నాడు. ఇలాంటి నేతల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిపోతే ఉంటుందా? సగం సీట్లలో కాంగ్రెస్​ పార్టీకి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్​ గెలిచేది లేదు వారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. నల్గొండలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండగల్​లో ఓడిపోయి రేవంత్​ రెడ్డి కేసీఆర్​ మీద కామారెడ్డిలో పోటీ చేస్తారంటా? మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్​ రెడ్డి.. నా మీద పోటీ చేస్తాడంటా." - హరీశ్​రావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది'

Harishrao Speech at BRS Public Meeting at Station Ghanpur : రాష్ట్రంలో కాంగ్రెస్​ ఇచ్చిన రూ.200 పింఛన్​ను రూ.2 వేలకు పెంచింది సీఎం కేసీఆర్​ ప్రభుత్వమే అని మంత్రి హరీశ్​రావు కొనియాడారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆరే అన్నారు. బీజేపీ హయాంలో గ్యాస్​ సిలిండర్ ధర చూస్తే మహిళల కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.400 సిలిండర్​ను మోదీ ప్రభుత్వం రూ.1000 చేసిందని విమర్శించారు. అంతకు ముందు ఆదిలాబాద్​లో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్​ రెండో జాబితా ప్రకటించిన వెంటనే బీఆర్​ఎస్​కు 100 సీట్లు గ్యారెంటీ అని ఫిక్సయ్యామని స్పష్టం చేశారు.

BRS Athmeeya Sammelanam at Station Ghanpur సిద్దిపేట తర్వాత నాకు స్టేషన్​ ఘన్​పూర్ కార్యకర్తలంటేనే ఇష్టం

Harish Rao Speech at BRS Public Meeting Adilabad : కాంగ్రెస్​ రెండో జాబితా వచ్చాక.. బీఆర్​ఎస్​ సెంచరీ ఖాయమని ఫిక్సయ్యాం : హరీశ్​రావు

Harish Rao on Medak District Development : 'మెదక్​లో ఆత్మగౌరవానికి.. నోట్ల కట్టలకు మధ్య పోటీ'

Last Updated :Oct 28, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.