ETV Bharat / state

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

author img

By

Published : Nov 7, 2019, 9:01 AM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శంషొద్దీన్(28)పై సన్నిహితుడు గొడ్డలితో దాడి చేశాడు.

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

ధర్మపురి ఎస్​ఐ శ్రీకాంత్​ తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురికి చెందిన శంషొద్దీన్​, నేపాల్​కు చెందిన దీపక్​ అవస్త్​ కొంత కాలంగా తుక్కుకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు. ఓ విషయంలో ఇద్దరికి మనస్పర్థలు రావడం వల్ల దీవక్​ అవస్త్​ గొడ్డలితో శంషొద్దీన్​పై దాడి చేశాడు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ధర్మపురి ఎస్​ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య

ఇదీ చూడండి : నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు సస్పెండ్

FROM G.GANGADHAR JAGITYALA CELL 800873563 ........ TG_KRN_21_07_HATYA_AV_TS10035 దర్మపురిలో యువకుడి హత్య.. యాంకర్ . జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ సమీపంలో బుధవారం అర్దరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. షంశొద్దీన్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు... తీవ్రంగా గాయపడిన అతన్ని మిత్రులు మెుదట దర్మపురి ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమించటంతో జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు.మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బద్రపరిచారు.కారణాలు తెలియలేదు... ధర్మపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.....vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.