ETV Bharat / state

నేను రష్మిక అంత ఫేమస్‌ కాదు - డీప్‌ ఫేక్‌ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 12:48 PM IST

Etv Bharat
Etv Bharat

Women Ask KTR Programme in Hyderabad : స్త్రీలు మానసికంగా చాలా బలంగా ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశామని.. ప్రతి చిన్నారిపై రూ.10,000కు పైగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెరిగిందని.. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని కేటీఆర్ వివరించారు.

Women Ask KTR Programme in Hyderabad : ప్రతి ఇంటికి తాగు నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్య వల్లే ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థినులు సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కుటుంబాల్లో స్త్రీలది ప్రధాన పాత్రని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన.. మహిళా సాధికారత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళలు కేటీఆర్‌ను.. పలు పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు - 6 నెలలకో సీఎం మారడం పక్కా : మంత్రి కేటీఆర్‌

KTR on Telangana Development : తెలంగాణలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కేటీఆర్ (KTR) గుర్తు చేశారు. తద్వారా స్త్రీలు చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారని చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలను తమ మేనిఫెస్టోలో పెట్టలేదని.. అయినా వాటిని అమలు చేశామని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా శిశు మరణాలు, ప్రసూతి మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేశామని.. అదే విధంగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళా ఎంట్రప్రిన్యూర్‌ల కోసం వీ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

మహిళల హక్కులు తెలుసుకునేందుకు వన్‌స్టాప్‌ సెంటర్‌ ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్త్రీలు మానసికంగా చాలా బలంగా ఉంటారని పేర్కొన్నారు. మైనార్టీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశామని.. ప్రతి చిన్నారిపై రూ.10,000కు పైగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెరిగిందని అన్నారు. అదే విధంగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం.. ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ వివరించారు.

'పరిగి నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణ నీళ్లు తెప్పిస్తా'

హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని.. నగరం నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది వారేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ స్త్రీలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వకపోయినా.. జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా నేతలకు అవకాశాలు కల్పిస్తోందన్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్‌ల కేటాయింపులోనూ భవిష్యత్‌లో వారికి మెరుగ్గా టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్‌, సోషల్ మీడియాపై స్ఫందించిన కేటీఆర్.. మహిళలు మాత్రమే దీని బారిన పడలేదని.. ప్రత్యర్థులు తమపై సైతం దీనిని వినియోగించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే తాను రష్మిక అంత ఫేమస్ కాదని కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు.

ఒక్కోసారి సోషల్ మీడియా విష ప్రచారాలకు వేదిక అవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం నల్సార్ వర్సిటీతో కలిసి సైబర్ నేరాలపై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 నుంచి 15 లోపు మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో (Special Manifesto for Women) రూపొందించి.. వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

"మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. నాణ్యమైన విద్య వల్లే ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థినులు సీట్లు సాధిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. మా మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు లేవు. మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ అమలు చేశాం." - కేటీఆర్‌, మంత్రి

డీప్‌ ఫేక్‌ మహిళలకే కాదు రాజకీయనాయకులకు కూడా ప్రమాదకరం

'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'

'మాది హైదరాబాద్​ - ఉర్దూ మాట్లాడ్డం మాకు కామన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.