'కోహ్లీ ఎలా అయితే సెంచరీ చేస్తాడో, అలానే కేసీఆర్ కూడా వంద సీట్లతో గెలుస్తారు'
Published: Nov 18, 2023, 9:22 PM

KTR Election Campaign in Nampally : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఆయా బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్ జిల్లాలోని నాంపల్లిలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేసి.. స్థానిక నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా అందిస్తామని చెప్పారు. దీంతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్థానిక బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఆనంద్ని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కోహ్లీ ఏ విధంగా అయితే సెంచరీ చేస్తాడో.. అదే విధంగా కేసీఆర్ కూడా వంద సీట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Minster KTR Latest Comments on Congress : హైదరాబాద్లో కులం, మతం, వర్గం, ప్రాంతం పేరిట విభేదాలు లేవని.. ప్రశాంతమైన వాతావరణాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని అన్నారు. దీనివల్లనే హైదరాబాద్కు దిగ్గజ కంపెనీలు తరలివస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఏ రాష్ట్రం వెళ్తే అక్కడ ప్రాంతీయ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని అంటారని అన్నారు. కోల్కత్తా వెళ్లినా.. దిల్లీలోనూ.. అలానే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ను బీజేపీ(BJP)కు బీటీమ్ అంటున్నారని మండిపడ్డారు.