ETV Bharat / state

'మాది హైదరాబాద్​ - ఉర్దూ మాట్లాడ్డం మాకు కామన్'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 10:54 AM IST

Updated : Nov 9, 2023, 11:25 AM IST

KTR Latest Tweet Today : కేటీఆర్.. ప్రస్తుతం ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియా సైతం ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్స్​లో చాలా యాక్టివ్​గా ఉండే కేటీఆర్.. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ అప్పుడప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్​ కేటీఆర్​పై ప్రశంసలు కురిపించాడు. ఈ ప్రశంస రాజకీయం, సేవాగుణం గురించి కాదండోయ్.. ఆయన భాషా పరిజ్ఞానంపై. ఇంతకీ అతను ఏమన్నాడంటే..!

KTR Tweet on Revanth Reddy
Minister KTR

KTR Latest Tweet Today : కల్వకుంట్ల తారకరామా రావు - కేటీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నేమ్​కు చాలా పాపులారిటీ ఉంది. కేసీఆర్ తనయుడిగా.. రాజకీయ నేతగా.. మంత్రిగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​గా కేటీఆర్ తన సత్తా చాటుతున్నారు. కేటీఆర్ తన నియోజకవర్గానికి.. తన శాఖల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక రాజకీయ వేత్తగా కేటీఆర్​కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆయన పర్సనాలిటీకి అంతకన్నా ఎక్కువ అభిమానులున్నారు. ఆయన మాటతీరు.. కాన్ఫిడెన్స్.. సామాజిక అంశాలపై ఆయనకు ఉన్న పట్టు.. వాటిపై ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాయి.

Netizen Praises KTR's Urdu Speaking Skills : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ప్రజాక్షేత్రంలో బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆయన సెల్ఫ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఎక్స్ (ట్విటర్)లో చాలా యాక్టివ్​గా ఉంటారు. ఇప్పుడే కాదు.. ఎన్నికలకు ముందు కూడా.. ఆయన ఎక్స్​లో యాక్టివ్​గా ఉండేవారు. ఎక్స్ వేదికగా ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. అప్పుడప్పుడు నెటిజన్లతో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ సమస్యలను కేటీఆర్​కు విన్నవించడమే కాకుండా.. తమకు ఆయనలో నచ్చిన విషయాలేంటో చెబుతూ ఉంటారు. ఆయన చేసిన పనులను ప్రశంసిస్తూ ఉంటారు.

మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు కటాఫ్​ను పరిశీలిస్తాం : కేటీఆర్‌

KTR Urdu Speaking Skills : తాజాగా ఓ నెటిజన్ కూడా కేటీఆర్​పై ప్రశంసలు కురిపంచాడు. అయితే ఈ ప్రశంస ఆయన రాజకీయ జీవితం గురించో.. ఆయన సేవాగుణం గురించో కాదు. ఆయన భాషా పరిజ్ఞానం గురించి. కేటీఆర్​ గురించి తెలిసిన వారందరికి ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడతారని తెలుసు. అయితే తాజాగా ఆయన ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్దూలో మాట్లాడారు. అది చూసిన ఓ నెటిజన్ కేటీఆర్ ఉర్దూ మాట్లాడాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. " కేటీఆర్ సాబ్.. మీరు ఉర్దూ చాలా బాగా మాట్లాడుతన్నారు. మీ ఉర్దూ చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది. మీరు చిన్నప్పుడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారా అంటూ ట్వీట్​లో కేటీఆర్​పై ప్రశంసలు కురిపించాడు.

  • Hyderabadi Hu Na

    Thoda Bol Lete Hum Log; Urdu Bhi, Hindi Bhi, Telugu Bhi Aur Angrezi Bhi 😄

    Shukriya for the compliment https://t.co/fvNYy1VFZh

    — KTR (@KTRBRS) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ట్వీట్​కు స్పందించిన మంత్రి కేటీఆర్.. "నేను హైదరాబాద్ వాసిని. మా హైదరాబాద్ వాళ్లమంతా.. కాస్త తెలుగు.. కొంచెం ఉర్దూ.. హిందీ.. ఇంగ్లీష్​లో మాట్లాడ్తాం. మాకు ఇదంతా కామన్. మీ ప్రశంసకు ధన్యవాదాలు" అంటూ రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కేటీఆర్ లాంగ్వేజ్ స్కిల్స్​ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ది మోస్ట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటూ నెటిజన్లు కామెంట్లలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  • Scamgress and it’s Gold Medal winners 😂😂

    What a pity! Scamgress couldn’t find someone else for the TPCC than this Guy who says getting arrested by Police for Bribery is a Medal !! https://t.co/XEF9kqF5kH

KTR Comments on Revanth Reddy : తాజాగా ఓటుకు నోటు కేసు తనకు మెడల్ అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. స్కాంగ్రెస్, గోల్డ్ మెడల్ విన్నర్స్ అంటూ ఎక్స్​లో వ్యాఖ్యానించారు. లంచం ఇస్తూ అరెస్ట్ అయి మెడల్ అని చెప్పుకునే వ్యక్తి (రేవంత్ రెడ్డి) తప్ప.. స్కాంగ్రెస్​కు ఇంకొకరు పీసీసీ చీఫ్​గా దొరకలేదని ఎద్దేవా చేశారు. అలాంటి నేతలను చూసి జాలి కలుగుతోందన్నారు.

9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే : కేటీఆర్‌

ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కేటీఆర్

Last Updated : Nov 9, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.