ETV Bharat / state

రాష్ట్రంలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 7:39 PM IST

Updated : Dec 23, 2023, 10:20 PM IST

Vaikunta Ekadasi Celebrations 2023
Vaikunta Ekadasi Festival in Telangana 2023

Vaikunta Ekadasi Festival in Telangana 2023 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి, స్వామివారిని దర్శించుకుని పునీతులౌతున్నారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ సహా వరంగల్‌లోని పలు వెంకటేశ్వర ఆలయాల్లో స్వామివారు ఉత్తరద్వార దర్శనమిచ్చారు. ధర్మపురిలో తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూలవిరాట్లకు అర్చకులు మాహా క్షీరాభిషేకం చేశారు. భద్రాద్రిలో సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడితో కలిసి భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు భక్తుల కోలాహల సందడి నడుమ రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

రాష్ట్రంలో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు

Vaikunta Ekadasi Festival in Telangana 2023 : ముక్కోటి ఏకాదశి వేళ రాష్ట్రంలోని వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుకొని, ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? - ఎలా పూజించాలి? - మీకు తెలుసా?

ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో(Yadadri Temple) లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార గుండా దర్శనమిచ్చారు. పర్వదినం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి నారసింహుడిని దర్శించుకున్నారు.

Vaikuntha Ekadashi 2023 : భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార నుంచి రాములోరు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేములవాడ రాజన్నఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులకు ఉత్తర ద్వార గుండా శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనమిచ్చారు.

Mukkoti Ekadasi Festival in Kondagattu : ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి(Kondagattu Anjaneya Swamy) ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్లలోని వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోనూ, వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Vaikunta Ekadashi Speciality : వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?

Mukkoti Ekadasi Celebrations 2023 : వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పర్వదినం పురస్కరించుకుకొని మంచిర్యాలలోనిని విశ్వనాథ ఆలయం, గూడెంలోని శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారా గుండా స్వామివార్లను దర్శనం చేసుకున్నారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోధాసమేత విరాట్‌ వెంకటేశ్వర స్వామిని మంత్రి దామోదర రాజనర్సింహా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులోని వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు.

Vaikunta Ekadasi Celebrations in Bhadrachalam : సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రేచపలిల్లోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి - మిస్​ అయితే అంతే!

ఈ సందర్భంగా స్వామివారిని అర్చకులు అందంగా అలంకరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు అట్టహాసంగా సాగాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోనూ, వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌లోని వైష్ణవాలయాల్లో వైకుంఠఏకాదశి మహోత్సవాలు : వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్తర ద్వార గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. పర్వదినం పురస్కరించుకొని కూకట్‌పల్లిలోని పలు వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మరోవైపు ముక్కోటి ఏకదశి పురస్కరించుకుకొని జియాగూడలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Vaikunta Ekadasi 2023 Telugu : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మరోవైపు కొత్తపేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో(Ashtalakshmi Temple) వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. గచ్చిబౌలిలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ మైహోం భూజలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తరహాలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహాం ప్రతిష్ఠించారు. పర్వదినం పురస్కరించుకుకొని వివిధ ప్రాంతాల నుంచి ఆలయాలకు తరలివచ్చిన భక్తులకు, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Vaikunta Ekadashi Speciality : వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?

భీష్మ ఏకాదశి వేడుకల్లో అరటి గెలల పందిరి

Last Updated :Dec 23, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.