ETV Bharat / state

భీష్మ ఏకాదశి వేడుకల్లో అరటి గెలల పందిరి

author img

By

Published : Feb 24, 2021, 12:30 PM IST

bheeshma ekadashi
అరటి గెలల పందిరి

భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చట్లతాండ్ర గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కట్టిన వేల అరటి గెలలు ఆకర్షణీయంగా నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చట్లతాండ్ర గ్రామంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం వద్ద వేలాది అరటి గెలలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 5వేలకు పైగా అరటి గెలలు కట్టడం ఆకర్షణగా నిలిచింది. వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భారీగా పందిరి వేసి అరటి గెలలు వేలాడ దీసి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. తమ కోరికలు నెరవేరుతున్నందున స్వామిని దర్శించుకుని అరటి గెల కడుతున్నట్లు పలువురు భక్తులు తెలిపారు.

250 ఏళ్ల క్రితం..

250 ఏళ్ల క్రితం స్వామీజీ పరవస్తు అయ్యవారు గ్రామానికి వచ్చి కొంతకాలం తర్వాత అక్కడే సజీవ సమాధి పొందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎంతో మహిమగల ఆయన.. స్వామి వారి ఉపాసకులు కావడంతో ఆయన సమాధిపై లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని నిర్మించి తరతరాలుగా పూజలు చేస్తున్నారు. సమాధిపై పుట్టిన మర్రిచెట్టు మొదలును ఆయన ప్రతిరూపంగా భావించి పూజిస్తున్నారు. ఆలయం వద్ద అరటి గెల కడితే తమ కోర్కెలు నెరవేరతాయన్నది భక్తుల విశ్వాసం.

భీష్మ ఏకాదశి వేడుకల్లో ఆకట్టుకున్న అరటి గెలల పందిరి

ఇదీ చదవండి: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, వ్రతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.