ETV Bharat / state

Rains in TS: మరో మూడు రోజులు జాగ్రత్త.. భారీ వర్షాలు కురిసే అవకాశం..!

author img

By

Published : Jul 24, 2022, 6:13 PM IST

Rains in TS: రాగల మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది.
Rains in TS
Rains in TS

Rains in TS: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిశా పరిసర ఛత్తీస్​గఢ్​​లో ఉన్న ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది. నిన్నటి ఉత్తర - దక్షిణ ద్రోణి ఈరోజు బలహీన పడినట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

హైదరాబాద్‌లోని భారీ వర్షం: ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్​లోని చింతల్, గాజులరామారం, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. సురారంలో, దుండిగల్‌, కాప్రా, ఎల్లారెడ్డిగూడ, కుషాయిగూడలో వాన పడింది. నాగారం, దమ్మాయిగూడలో భారీగా వర్షం కురిసింది.

ఇవీ చదవండి: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్​లో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

ఐఎస్​సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.