ETV Bharat / state

T-9 Tickets in TSRTC Palle velugu Buses : నేటి నుంచి 'పల్లె వెలుగు'లోనూ ఒకే టికెట్​పై రోజంతా..

author img

By

Published : Jun 18, 2023, 8:10 AM IST

TSRTC
TSRTC

T-9 Tickets in TSRTC : గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-9 టికెట్ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్​ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

T-9 Tickets from Today in Palle velugu Buses : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేలా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థ్యం తీసుకొచ్చిన టీ-9 టికెట్ ఇవాళ్టి నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. టీ-9 టికెట్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్​కు వర్తిస్తుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానుపోనూ ప్రయాణం చేయొచ్చు. ఈ టీ-9 టికెట్​ ధరను రూ.100గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ ఛార్జీల‌పైన మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వ‌ర‌కు ఆదా అవుతుంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

TSRTC T-9 Tickets Latest News : 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్​ వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టికెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. పల్లె వెలుగు బ‌స్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్స్​ ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్​కు తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఈ టికెట్​తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ పేర్కొంది. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.

టికెట్ పూర్తి వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించండి : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని యాజమాన్యం పేర్కొంది. ఆ టికెట్లకు మంచి స్పందన వ‌స్తుండ‌టంతో తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల కోసం టీ-9 టికెట్​ను తీసుకువచ్చామని తెలిపింది. ఈ టికెట్​కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్​లోని బస్ భవన్​లో టీ-9 టికెట్ పోస్టర్​ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఆవిష్కరించారు. టీ-9 టికెట్లను ఆదరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.