ETV Bharat / state

దిల్లీకి పాకిన వీధి శునకాల గొడవ.. అసలేం జరిగిందంటే..

author img

By

Published : Dec 29, 2021, 4:55 PM IST

Street dogs issue in KPHB colony
దిల్లీకి చేరిన వీధి శునకాల గొడవ

Street dogs issue in KPHB colony: అదొక గేటెడ్​ కమ్యూనిటీ.. ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఈ క్రమంలో కొంత కాలంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నది ఒకటే.. అదే వీధి కుక్కల బెడద. కాలనీలోకి వెళ్తే చాలు వెంటపడి కరిచేస్తున్నాయి. దీంతో వాటి గోల తట్టుకోలేక కమ్యూనిటీ వాసులు.. శునకాలను ఓ సంస్థకు అప్పగించారు. ఇక అక్కడ మొదలైంది వారికి సమస్య. ఈ ఘటనపై దిల్లీ నుంచి వీరిపై ఒత్తిడి మొదలైంది.

Street dogs issue in KPHB colony: కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో తలెత్తిన వీధి కుక్కల బెడద.. పోలీసు ఎఫ్ఐఆర్​లతో పాటు దిల్లీలోని ఓ ఎంపీ జోక్యానికి దారి తీసింది. దీంతో ఈ సమస్య కమ్యూనిటీ వాసులకు కొరకరాని కొయ్యగా తయారైంది. ఈ బాధలు భరించలేక... మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

వెంటపడి గాయపరిచి

మలేషియన్ టౌన్​షిప్ రెయిన్ ట్రీ గేటెడ్​ కమ్యూనిటీ పార్కులో గత సంవత్సరం నుంచి వీధి కుక్కల బెడద ఎక్కువైందని ఆ కాలనీ వెల్ఫేర్​ అధ్యక్షుడు సురేష్​ అన్నారు. కాలనీలో వీధి కుక్కలు ఎక్కువవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనాల వెంటపడేవని పేర్కొన్నారు. ఈ క్రమంలో వాటి బెడద భరించలేక ఓ సంస్థకు కుక్కలను దత్తతకు ఇచ్చి వాటిని అక్కడి నుంచి తరలించినట్లు వివరించారు.

దూషిస్తున్నారు

మా టౌన్​షిప్​లో 20 శునకాలు ఉన్నాయి. అందులో 5 మాత్రమే మాకు చెందినవి. పీఎఫ్​ఏ సంస్థకు చెందిన కొందరు.. వీధి కుక్కలను మచ్చిక చేసుకొని ఎవరూ లేని సమయంలో మా కమ్యూనిటీలో వదిలేస్తున్నారు. వీటి ద్వారా మాకు చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని గాయపరిచింది. ఏం చేయాలో తోచక వీటిని ఓ సంస్థకు అప్పగించాం. దీంతో పీఎఫ్​ఏ ప్రతినిధులు మాపై పోలీసు కేసులు పెట్టారు. పీఎఫ్​ఏ నిర్వాహకురాలు మేనక గాంధీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా సమస్యను పరిష్కరించాలి. -సురేశ్​, కమ్యూనిటీ వెల్ఫేర్​ అధ్యక్షుడు

ఈ విషయమై పీపుల్స్ ఫర్ యానిమల్స్(పీఎఫ్ఏ) సంస్థ ప్రతినిధులు.. కుక్కల దత్తతు అక్రమంగా చేశారని కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎఫ్ఏ వ్యవస్థాపకురాలు, ఎంపీ మేనకగాంధీ.. తమకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని సురేష్​ ఆవేదన వ్యక్తం చేశారు. తమను బెదిరించారని ​ ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపించాలని కమ్యూనిటీ వాసులు వేడుకున్నారు.

మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న కమ్యూనిటీ వాసులు

ఇదీ చదవండి: Govt land kabza in Banjara Hills: రూ.220కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.