ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్​1PM

author img

By

Published : Aug 17, 2022, 12:58 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్​1PM

  • చిన్నారుల స్కూల్​ బస్సుపై దుండగుల దాడి

స్కూల్​ చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్​పై పదునైన కత్తులతో వచ్చిన దుండగులు.. బస్సును వెంబడించారు. ఈ ఘటన పంజాబ్​ బర్నాలాలో జరిగింది. బస్సు డ్రైవర్​పై దాడి చేయగా.. స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్​ చాకచాక్యంగా వ్యవహరించాడు. బస్సును వెంటనే సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

  • బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలు ఆలస్యం

Basara RGUKT admissions late నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కొత్త సమస్య ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు మొదటి సంవత్సరం ప్రవేశాల జాబితా విడుదల కాలేదు. ఈడబ్ల్యూఎస్​ కోటాపై స్పష్టత రాకపోవడం వల్లే ఇలా జరిగిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

  • మహిళల పట్ల ప్రధాని మోదీకి గౌరవం ఉందా

KTR Tweet Today మహిళల పట్ల ప్రధాని మోదీకి గౌరవం ఉందా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను ప్రభుత్వం విడుదల చేయటంపై మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం పట్ల ప్రధానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

  • రూ 500 కోసం స్నేహితుల గొడవ

రూ. 500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన అసోం రంగాపాడాలోని దయాల్​పుర్​ గ్రామంలో ఆగస్టు 15న అర్ధరాత్రి జరిగింది. ఘటన తర్వాత మృతుడి తలతో పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు నిందితుడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దయాల్​పుర్​ గ్రామానికి చెందిన తునీరామ్​ మాద్రి.. బ్రోయిలర్​ హేమ్​రామ్​(55) తల నరికాడు. అనంతరం ఆ తల, కత్తి పట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.

  • పోలీసులకు సైబర్ కేటుగాళ్ల ఛాలెంజ్

బిహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, నేపాల్‌ తదితర ప్రాంతాల్లో పది, ఇంటర్‌ తప్పిన యువకులు నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు. రూ.వేల సంపాదన నుంచి రూ.కోట్లకు చేరారు. మందీ, మార్బలం తయారు చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు రూ.లక్షల్లో కమీషన్‌ ముట్టజెబుతున్నారు. అరెస్టయితే క్షణాల్లో బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వ్యక్తిగత న్యాయవాదులను నియమించుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకొనేందుకు పోలీసులు అరకొర జాగ్రత్తలతో వెళ్తున్నారు.

  • సోషల్​ మీడియా ఫేమ్​ కిడ్నాప్​

తమిళనాడు చెన్నైలో సోషల్​ మీడియా ఫేమ్​ డ్యాన్సర్​ రమేశ్​ కిడ్నాప్​కు గురైనట్లు కేసు పెట్టింది అతడి రెండో భార్య. 50 ఏళ్ల రమేశ్​.. రోడ్డు పక్కన దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమేశ్​కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ చేయాలనే ఆసక్తి ఉంది. దీంతో అతడు తన పేరును సైతం డ్యాన్సర్​ రమేశ్​గా మార్చుకున్నాడు. చిన్న కార్యక్రమాల్లో డ్యాన్స్​ చేస్తుండేవాడు. ఈక్రమంలోనే తన స్నేహితుల సలహాతో డ్యాన్స్ చేస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. తనదైన స్టైల్​లో డ్యాన్స్ చేస్తున్న రమేశ్​ సోషల్​ మీడియాలో పాపులర్​ అయ్యాడు. టీవీల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోల్లో సైతం పాల్గొన్నాడు. సోషల్​ మీడియాలో పాపులర్​గా మారడం వల్ల రమేశ్​.. ఆర్థికంగా కుదురుకున్నాడు.

  • ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారం ధర ఎంతంటే

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 53,730 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.30 తగ్గి ప్రస్తుతం రూ.59,508 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • సూర్యను ఏబీడీతో పోల్చడం తొందరపాటే

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్​తో టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్​ను పోల్చడం తొందరపాటు అవుతుందని పాక్‌ మాజీ సారథి సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. ఏబీడీ వంటి మరో ఆటగాడిని క్రికెట్‌ ప్రపంచంలో చూడలేమని పేర్కొన్నాడు.

  • స్పెయిన్​లో నయన్​ విఘ్నేశ్​ వెకేషన్​​

ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచారు విఘ్నేశ్​ నయనతార దంపతులు. పెళ్లికి ముందు షూటింగ్‌లో విరామం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. వివాహం తరువాత కూడా ఈ జంట అలాగే చిల్​ కొడుతోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారిద్దరు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. మీరూ ఓ సారి వాటిపై లుక్కేయండి.

  • అల్లు అర్జున్​ క్రేజ్​ తగ్గేదేలే​, 7 మిలియన్ల ఫాలోవర్లతో

'పుష్ప' సినిమా తర్వాత ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పాపులారిటీ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. తన నటనతో టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ట్విట్టర్​లో ఆయన 7 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్​ చేశారు అల్లు అర్జున్​. మరో సోషల్​ మీడియా దిగ్గజం ఇన్​స్టాగ్రామ్​లో బన్నీకి 18 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.