ETV Bharat / bharat

రూ 500 కోసం స్నేహితుల గొడవ, కత్తితో తలనరికి పోలీస్​ స్టేషన్​కు

author img

By

Published : Aug 17, 2022, 11:13 AM IST

ఇద్దరు స్నేహితుల మధ్య రూ. 500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. డబ్బులు అడిగిన వ్యక్తి తల నరికి పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు నిందితుడు. అసోంలో ఈ ఘటన జరిగింది.

Man beheads friend for Rs 500, surrenders with severed head in Assam
Man beheads friend for Rs 500, surrenders with severed head in Assam

రూ. 500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన అసోం రంగాపాడాలోని దయాల్​పుర్​ గ్రామంలో ఆగస్టు 15న అర్ధరాత్రి జరిగింది. ఘటన తర్వాత మృతుడి తలతో పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు నిందితుడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దయాల్​పుర్​ గ్రామానికి చెందిన తునీరామ్​ మాద్రి.. బ్రోయిలర్​ హేమ్​రామ్​(55) తల నరికాడు. అనంతరం ఆ తల, కత్తి పట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు.

ఇదీ జరిగింది.. హేమ్​రామ్​కు రూ. 500 అవసరమై మాద్రిని అడిగాడు. నిరాకరించిన మాద్రిని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. కోపోద్రిక్తుడైన తునీరామ్​ మాద్రి ఆవేశంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో హేమ్​రామ్​ మెడపై వేటు వేశాడు. ఆ తల పట్టుకొని పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఆకాశంలో త్రివర్ణం రెపరెపలు, జాతీయ జెండాతో గాల్లో చక్కర్లు కొట్టిన గద్ద

ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.