ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM

author img

By

Published : Jan 1, 2023, 11:01 AM IST

Telangana Top News
టాప్​న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • చివరి త్రైమాసికంలో రూ.6 వేల కోట్లకుపైగా రుణం తీసుకోనున్న సర్కార్

చివరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లకు పైగా రుణం తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుగా తీసుకొంది.

  • న్యూ ఇయర్​ జోష్​.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో ఆశయాలు నెరవేరాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది.

  • రామగుండం NTPC ప్లాంటులో విద్యుదుత్పత్తికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు.. నేడో, రెేపో..!

రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన కొత్త విద్యుత్‌ కేంద్రం మొదటి ప్లాంట్​లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్లను నిర్మించింది. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్‌ రూ.5కే లభిస్తుంది.

  • బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. టిఫిన్​ చేస్తున్న ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

  • దేశంలోనే అతిపెద్ద 'జాబ్​ స్కామ్​' బట్టబయలు.. బాధితుల్లో ఆంధ్రా యువత

దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్లు ప్రకటించారు ఒడిశా పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఐదు రాష్ట్రాల నిరుద్యోగుల్ని మోసం చేసిన ముఠాలో కీలక నిందితుడ్ని అరెస్టు చేశారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్​ డెడ్

ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న లారీ ఓ కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

  • న్యూఇయర్​లో బంగారం కొనాలా? ఆంధ్ర, తెలంగాణలో ధరలు ఇలా..

దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలా? ఈ 'రైడర్లు' గుర్తుపెట్టుకోండి!

కొత్త ఏడాదిలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ పాలసీని ఎంచుకునే సమయంలో కొన్ని అనుబంధ పాలసీలనూ (రైడర్లు) జోడించుకోవడం మర్చిపోవద్దు.

  • 2023 సమరం ఆరంభం.. ఇక సమయం లేదు మిత్రమా..!

ప్రపంచ కప్​ను ముద్దాడాలని భారత్​ ఎంతో ఊవిళ్లూరుతోంది. ఓ వైపు క్రికెట్‌.. మరోవైపు హాకీ.. ఇంకోవైపు ఫుట్‌బాల్‌.. ఇలా 2023లో ఎటు చూసినా ప్రపంచకప్‌ల జోరు మొదలయ్యింది. మరోవైపు బరిలో సమర శంఖాన్ని మోగించేందుకు మన ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 2023 భారత క్రీడా ప్రపంచం ఎలా ఉండనుందో ఓ సారి చూద్దామా..

  • 'వీర సింహారెడ్డిలో ఇంటర్వెల్, వాల్తేరు వీరయ్యలో రవితేజ ఎపిసోడ్.. చూస్తే కన్నీళ్లు ఖాయం!'

రామ్​-లక్ష్మణ్​.. ఎన్నో సూపర్​హిట్ సినిమాలకు యాక్షన్​ కొరియోగ్రఫీ చేసిన కవల సోదరులు. సంక్రాంతి రేసులో ఉన్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' , బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాల్లో ఫైట్ సీక్వెన్స్​లు డిజైన్ చేసింది వీరే. ఆ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు రామ్​-లక్ష్మణ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.