ETV Bharat / business

టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలా? ఈ 'రైడర్లు' గుర్తుపెట్టుకోండి!

author img

By

Published : Jan 1, 2023, 9:54 AM IST

term insurance riders
term insurance riders

కొత్త ఏడాదిలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ పాలసీని ఎంచుకునే సమయంలో కొన్ని అనుబంధ పాలసీలనూ (రైడర్లు) జోడించుకోవడం మర్చిపోవద్దు.

కొత్త ఏడాదిలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ పాలసీని ఎంచుకునే సమయంలో కొన్ని అనుబంధ పాలసీలనూ (రైడర్లు) జోడించుకోవడం మర్చిపోవద్దు. వీటివల్ల మీ పాలసీకి విలువ పెరగడంతోపాటు, కొన్ని సందర్భాల్లో అదనపు రక్షణ లభించేందుకు అవకాశం ఉంటుంది. టర్మ్‌ పాలసీలతో పాటు తీసుకునేందుకు ఎన్నో రైడర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో అన్నీ అందరికీ అవసరం లేదు. కానీ, కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రమాదంలో: పాలసీదారుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే.. అదనపు బీమా రక్షణ కల్పించేది 'యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌'. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లోపు మరణం సంభవిస్తే ఈ రైడర్‌ కింద హామీ ఇచ్చిన మొత్తం చెల్లిస్తారు. ప్రామాణిక పాలసీ కింద ఇచ్చే పరిహారానికి ఇది అదనం.

తీవ్ర వ్యాధులు: పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు ఏదైనా తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు పరిహారం లభించేలా 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌'ను ఎంచుకోవాలి. పాలసీలో పేర్కొన్న వ్యాధి వచ్చిందని తేలగానే చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా నిర్ణీత మొత్తాన్ని పాలసీ చెల్లిస్తుంది. కొన్నిసార్లు ప్రాథమిక పాలసీలో నుంచి చెల్లించిన పరిహారాన్ని మినహాయిస్తారు. లేదా అదనంగా చెల్లిస్తుంది. ఇది మీరు ఎంచుకున్న పాలసీని బట్టి, ఆధారపడుతుంది.

ప్రీమియం రద్దయ్యేలా: తీవ్ర వ్యాధులు, ప్రమాదం, వైకల్యం తదితర సందర్భాల్లో టర్మ్‌ పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా రొచ్చు. ఇలాంటప్పుడు ప్రీమియం చెల్లించక్కర్లేకుండా 'వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం' రైడర్‌ ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పాలసీ కొనసాగేందుకు ఈ అనుబంధ పాలసీని ఎంచుకోవడం అవసరం. పాలసీదారుడు రైడర్లను పూర్తిగా అర్థం చేసుకొని, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. అప్పుడే అవి అదనపు రక్షణ కల్పిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.