ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM

author img

By

Published : Dec 25, 2022, 10:59 AM IST

Telangana Top News today
Telangana Top News today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • రాజధాని పోలీసింగ్‌కు కొత్త ముఖచిత్రం..

కొత్త ఏడాదిలో భాగ్యనగర పోలీసింగ్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థను తీర్చిదిద్దే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే కొత్తగా జోన్లు, డివిజన్లు, ఠాణాల పెంపుపై దృష్టి సారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

  • JNTUలో సందడిగా అండర్‌గ్రాడ్‌ సదస్సు..

హైదరాబాద్‌ జేఎన్​టీయూలో స్టూమాగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ​గ్రాడ్‌ సదస్సు ఘనంగా జరిగింది. నగరంలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులను ఒక దగ్గరకు చేర్చుతూ నిర్వహించిన ఈ సదస్సులో.. విజ్ఞానం, సమాచారంతో పాటు ఆలోచనలను పంచుకునేలా రోజంతా కార్యక్రమం సాగింది.

  • రాజసం.. ఆతిథ్యం.. బొల్లారం నిలయం..

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇందుకోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు.

  • 'ఆపరేషన్ ధృవ' సక్సెస్..

ఇటుక బట్టీల్లో అక్షరచైతన్యం మొదలైంది. తల్లిదండ్రులతో కలిసి బట్టీల్లోకి పనులకు వెళ్లకుండా చదువుకునేందుకు పెద్దపల్లి పోలీసులు ఆపరేషన్ ధృవ పేరుతో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. దశాబ్దాలుగా ఉపాధి కోసం తల్లిదండ్రులు వలస వస్తే వారితో వచ్చే చిన్నారుల బాల్యం బుగ్గిపాలవుతోంది.

  • రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

  • స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

భారత్​లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 227 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

  • ఆధార్‌ తీసుకొని పదేళ్లయిందా..? అయితే తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే

ఆధార్‌ తీసుకొని పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేయని వాళ్లు తప్పనిసరిగా కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ)సూచించింది.

  • ఏవీ గత క్రిస్మస్‌ కాంతులు..!

వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా.. యుద్ధ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా సైనికులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్న ఉక్రెయిన్.. ఇప్పుడు యుద్ధంతో విలవిలలాడుతుంది.

  • టీమ్​ఇండియాకు బిగ్​ షాక్​..

కొత్త ఏడాదిలో శ్రీలంక‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమ్​ఇండియా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీతో పాటు ఓపెన‌ర్ కేఎల్ రాహూల్ దూరం కానున్న‌ట్లు తెలిసింది.

  • 'తెలుగు పరిశ్రమ మరో మంచి నటుడిని కోల్పోయింది'

సీనియర్​ నటుడు చలపతిరావు మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.