ETV Bharat / bharat

ఆధార్‌ తీసుకొని పదేళ్లయిందా..? అయితే తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే

author img

By

Published : Dec 25, 2022, 9:39 AM IST

aadhar holders to update documents
ఆధార్‌

ఆధార్‌ తీసుకొని పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేయని వాళ్లు తప్పనిసరిగా కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ)సూచించింది.

పదేళ్లనుంచి ఒక్కసారి కూడా ఆధార్‌ అప్‌డేట్‌ చేయనివారు కార్డుకుసంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికారసంస్థ మరోసారి కోరింది. పోటీ పరీక్షలు రాయాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, వేరే దేశం ప్రయాణించాలన్నా, ఆఖరికి చిన్నపిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ లేని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సేవలు దాదాపుగా పొందలేకపోతున్నారు. ఈ కార్డు ప్రజల జీవితంలో ముఖ్య అవసరంగా మారిపోయింది. ఎంతలా అంటే ఆధార్‌ లేని వ్యక్తికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు.

ఆధార్‌ను పదేళ్లకు ఒకసారి అప్‌డేట్‌ చేసుకోవాలని కార్డు దారులను యూఐడీఏఐ కోరింది. దీనికోసం గత నెలలోనే ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆప్‌డేట్‌ డాక్యుమెంట్‌ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చని, లేదా తమ వద్దనున్న ఆధార్‌ కేంద్రాల ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్‌ అప్‌డేట్‌.. సులభంగా సేవలు పొందటానికి మరింత సహాయ పడుతుందని తెలిపింది.

గత కొన్నేళ్లుగా.. ఆధార్‌ దాదాపు తప్పని సరి అయిపోయింది. 1,100పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ సంఖ్య ఆధారంగానే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 134 కోట్ల ఆధార్‌ నంబర్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న చిరునామాతో ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. దీనికోసం నవంబరు 9న ఆధార్‌ నిబంధనలు సవరించి పదేళ్లకోసారి అప్‌డేట్‌ తప్పనిసరి చేసింది.

ఇవీ చదవండి:

ట్విట్టర్ పిట్ట స్పెషల్ ఫీచర్స్​ తెలుసా?

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌.. వీడియోలో నచ్చిన కంటెంట్‌ చూసేలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.