ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM

author img

By

Published : Dec 14, 2022, 12:58 PM IST

1PM TOPNEWS
1PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయాన్నిసీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌యాదవ్‌, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు. మరోవైపు ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

  • బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నాను: కేటీఆర్

బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈ ఉదయం ఢిల్లీ చేరుకోవాల్సిన మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో రాలేకపోతున్నట్లు వెల్లడించారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

  • డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. నవీన్ రెడ్డిపై పోలీసుల పీడీ యాక్ట్?

హైదరాబాద్‌ మన్నెగూడలో దంతవైద్యురాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నవీన్‌రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా.. వరంగల్‌లో రెండేళ్ల క్రితం మరో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతడిపై పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారు.

  • జరిమానాలే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వరంగల్​ ట్రాఫిక్ పోలీసులు

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరంగల్‌తో పాటు హనుమకొండ, కాజిపేటలోని ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే వాహనాల రద్దీని నియంత్రించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు విధులను గాలికోదిలేసి జరిమానాలే లక్ష్యంగా ఫోటోలు తీస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

  • ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలు సమర్పించాలి.. సీబీఐకి ఆదేశం

ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలను వెంటనే తమకు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఒరిజినల్ పత్రాలు, జప్తు చేసిన వస్తువులు లేనందున కేసు విచారణ వాయిదా వేయాల్సి వస్తోందని సీబీఐకి లేఖ రాసింది.

  • గ్యాస్ సిలిండర్ ట్రక్కులో పేలుడు భారీగా ఎగిసిపడిన మంటలు

బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సిలిండర్లు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఓ సిలిండర్ భాగం భగవాన్ పెట్రోల్ పంపులోని వాటర్ ట్యాంక్‌లో పడింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న ఓ హోటల్‌ కూడా దగ్ధమైంది.

  • మెస్సీ సంచలన ప్రకటన.. ఇదే అతడి చివరి ప్రపంచకప్‌ అంటా!

అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సంచలన విషయాన్ని ప్రకటించాడు. ఫిఫా వరల్డ్ కప్​ 2022 ఫైనల్​ తన చివరి మ్యాచ్​ అని తెలిపాడు.

  • స్టార్ క్రికెటర్​కు తీవ్ర గాయాలు.. ఆ షో షూటింగ్​లో ప్రమాదం

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్​ ప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించారు.

  • పెరిగిన బంగారం ధర.. రూ.70వేలు దాటిన కేజీ వెండి.. ఏపీ, తెలంగాణలో ఇలా..

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • ఏంటి పవన్​ కల్యాణ్​​ మార్షల్​ పోజు మంచు లక్ష్మీదా.. వైరల్​గా మారిన పోస్ట్

పవన్​ కల్యాణ్​ను ఉద్దేశిస్తూ.. మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఆ సంగతులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.