ETV Bharat / state

Telangana SI Candidates Training 2023 : కొత్త ఎస్సైల శిక్షణకు సర్వం సిద్ధం.. ఈ తేదీ​ గుర్తుపెట్టుకోండి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 7:15 AM IST

Telangana SI Candidates Training in Police Academy : తెలంగాణ రాష్ట్రంలో ఎంపికైన ఎస్సైలకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్​ నియామక మండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు వసతులు కల్పించారు. 414 మంది ఎంపికైన సివిల్​ పోలీసులకు ఈ నెల 16 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

Telangana Police
SI Candidates Training in Police Academy in Telangana

Telangana SI Candidates Training 2023 కొత్త ఎస్సైల శిక్షణకు సర్వం సిద్ధం ఈ తేదీ​ గుర్తుపెట్టుకోండి

Telangana SI Candidates Training in Police Academy : తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి(Telangana State Police Recruitment Board) నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన ఎస్సైలకు శిక్షణ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ(Raja Bahudur Venkatram Reddy Telangana State Police Academy)లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎంపికైన 414 మంది సివిల్ పోలీసులకు ఈ నెల 16 నుంచి శిక్షణ ప్రారంభం కానుండగా.. 10న అకాడమీలో రిపోర్ట్ చేయనున్నారు. వీరితో పాటు క్రితంసారి నోటిఫికేషన్‌లో ఎంపికైనా.. పలు కారణాలతో శిక్షణ పూర్తి చేయని మరో 19 మంది సివిల్ ఎస్సై(Civil SI)లు సైతం తాజాగా శిక్షణ కోసం అకాడమీకి చేరుకోనున్నారు.

TS Civil SI Training Date 2023 : ఇటీవల పోలీసు నియామక మండలి చేపట్టిన నియామకాల్లో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌లోని 121 ఎకరాల సువిశాల ప్రాంగణంతో కూడిన తెలంగాణ పోలీస్‌ అకాడమీలో వీరందరికి ఏడాది పాటు ఇండోర్, ఔట్ డోర్ శిక్షణ జరగనుంది. ఈసారి సివిల్ పోలీసుల్లో 33 శాతం మహిళలున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికి ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేశారు. ఈసారి నోటిఫికేషన్‌లో మిగిలిన విభాగలకు ఎంపికైనవారి శిక్షణ కొంత ఆలస్యంగా ప్రారంభం కానుంది.

హైదరాబాద్​లో కొత్తగా పలు డివిజన్లు.. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు

TS SI Training Period : సివిల్ విభాగంతో పోల్చితే వాటికి తక్కువ కాలం శిక్షణ ఇవ్వనుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. 23 మంది టీఎస్​ఎస్​పీ.. ఎస్సైలకు 10 నెలల శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో రెండు నెలల తర్వాత వారు అకాడమీకి చేరుకోనున్నారు. అలాగే 66 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్‌, 22 మంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, 12 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ ఎస్సైలకు 9 నెలల శిక్షణ అవసరముండటంతో వీరంతా మూడు నెలల అనంతరం అకాడమీకి రానున్నారు. మరోవైపు 8 మంది ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్సై, ఏఎస్సైలకు మూడు నెలల శిక్షణ మాత్రమే అవసరం పడుతుంది. వీరు కూడా మూడు నెలల తర్వాత అకాడమీకి చేరుకొని శిక్షణ పొంది బయటికి వెళ్లనున్నారు. అయితే ఏడాది తర్వాత అందరికి కలిపి జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు.. ఈ 8 మంది తిరిగి హాజరవుతారు.

జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం : పోలీస్ అశావహులు

TS Police SI Training Date 2023 : ఎస్సైలకు ఇచ్చే శిక్షణ మోడ్యూల్స్‌లో ఈసారి పలు మార్పులు జరిపారు. గతంతో పోల్చితే ఈసారి బేస్ స్టడీస్ సహిత శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సైబర్, నార్కొటిక్ డ్రగ్స్ నేరాల పరిశోధనలో మరిన్ని మెలకువలు నేర్పించనున్నారు. రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తర్ఫీదుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సుమారు 130 మంది నిపుణులు ఈ ఏడాది కాలం శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్ విభాగం శిక్షణను 23 మంది డీఎస్పీల నుంచి ఎస్పీ స్థాయి అధికారులు.. ఔట్ డోర్ శిక్షణను ఏడుగురు అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.

TSLPRB Focus On Police Candidates Training : అక్టోబర్​లో కానిస్టేబుళ్లకు శిక్షణ! 28 కేంద్రాల్లో ఏర్పాట్లు

Police Service Medals 2023 List : పోలీస్​ పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి 34 మంది ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.