ETV Bharat / state

రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - యాసంగి పంట పెట్టుబడిసాయం విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 7:44 AM IST

Telangana Rythu Bandhu Funds Released 2023 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల హామీ అయిన రెండు లక్షల రుణమాఫీ అమలుకు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సాగులో లేని, స్థిరాస్తి వ్యాపారం జరుగుతున్న భూములకు పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. అన్ని అంశాలను శాసనసభలోనే ప్రస్తావించి చర్చిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు.

Telangana Rythu Bandhu Funds 2023
Rythu Bandhu Funds

రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - పంట పెట్టుబడి సాయం విడుదల

Telangana Rythu Bandhu Funds Released 2023 : వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, అధికారులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.

Govt Releases Rythu Bandhu Funds : రైతులకు పంట పెట్టుబడి సాయంపై సమావేశంలో చర్చ జరిగింది. రైతుబంధు(Rythu Bandhu Scheme) అమలు తీరు, లబ్ధిదారులు, వ్యయం, సంబంధిత అన్ని అంశాలను అధికారులు వివరించారు. సాగు చేయనప్పటికీ ప్రతి భూమికి పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగులో లేని, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. రైతుబంధుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభ వేదికగానే రైతుబంధుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు తెలిసింది.

రైతులకు బోనస్​, రైతుబంధు ఎప్పుడు ఇస్తారు : హరీశ్​రావు

CM Revanth Reddy On Rythu Bandhu Funds : ప్రస్తుత సీజన్‌కు పంట పెట్టుబడి సాయం విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాము హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున ఎన్నికల సమయంలో నిలిచిపోయిన రైతుబంధు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చెల్లింపులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రైతుబంధు చెల్లింపులను ప్రారంభించారు.

CM Revanth Reddy Orders To Release Rythu Bandhu Funds : ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలు, వివరాలను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. వివిధ పంటల సాగు విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితరాల గురించి వివరాలు ఆరా తీశారు.

Rythu Bandhu Funds Released in Telangana : రాష్ట్రంలో పసుపు రైతులు, సాగయ్యే విస్తీర్ణం, తదితరాలను తెలుసుకున్న సీఎం, ఇంత తక్కువ సంఖ్యలో పసుపు రైతులు ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది ఏఈవోల పనితీరు, రైతు వేదికల గురించి ఆరా తీశారు. అంత భారీ ఖర్చుతో నిర్మించిన రైతు వేదికలు ఎందుకు వినియోగంలో లేవని, క్రియాశీలంగా పనిచేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర, ప్రభుత్వపరంగా అందించాల్సిన ఇతర ప్రోత్సాహకాల తదితరాల గురించి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సంబంధించిన అంశాలపై అధికారులు ఇంకా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయబడినట్లు సమాచారం.

సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు

డిసెంబర్ ఆఖరిలో రైతుబంధు 100 శాతం ఇస్తాం : పొన్నం ప్రభాకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.