ETV Bharat / state

తుది ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం - పార్టీ గుర్తును చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 7:15 PM IST

Telangana political Parties Speed up Election Campaign : పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడుతూ ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలంటూ.. ఇంటింటికి తిరిగి పార్టీ గుర్తు చూపుతూ.. విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Main Parties Election Campaign
Telangana political Parties Speed up Election Campaign

Telangana political Parties Speed up Election Campaign తుది ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం పార్టీ గుర్తును చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు

Telangana political Parties Speed up Election Campaign : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ బోరబండ డివిజన్‌లో.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్‌-సనత్‌నగర్‌లోని కేఎల్ఎన్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, పద్మారావునగర్​ పార్క్​లలో వాకర్స్‌ని కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రచారం చేశారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి గణేష్.. ప్రచారంలో భాగంగా.. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి సారంగపాణికి మద్దతుగా.. ఈటల రాజేందర్ ప్రచారం చేశారు.

'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నాంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్రకు మద్దతుగా.. కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో నిర్వహించిన.. మహిళ గర్జనలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

మహబూబ్​నగర్​లో ఉదయపు నడకకు వచ్చే వారిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిశారు. బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓటు వేయాలని కోరారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో.. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

Telangana Election Campaign : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్‌లో.. బీఆరఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్​ఠాగూర్ సైతం ఇంటింటి తిరిగి ఓటు అభ్యర్థించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో ప్రచారం చేసిన హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్‌కు.. మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు.

ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్​లిక్కర్ రేటంతేనా?

మంత్రి పువ్వాడ ‌అజయ్‌ ఖమ్మంలోని పలు డివిజన్లలో ఉదయం నుంచే ప్రచారం కొనసాగించారు. పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి గుదిమళ్లలో ప్రచారం నిర్వహించగా.. డప్పు చప్పుల్లతో స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ... టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు ర్యాలీ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని పలు కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో మూడో విడత ప్రచారంలో.. నియోజకవర్గ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా.. మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు.

Telangana Main Parties Election Campaign : ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండంతో అభ్యర్థులకు మద్దతుగా.. వారి సతీమణులు, కుమార్తెలు సైతం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ తరపున ఆయన సతీమణి ప్రమీల, కుమార్తెలు ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రజలు ఆటపాటలతో స్వాగతం పలికారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. భువనగిరి జిల్లా, మోత్కూరులో.. తుంగతుర్తి బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య గెలుపు కోరుతూ యువకులు మాస్క్‌లు ధరించి.. ప్రధాని మోదీ పోస్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు తండాలో.. ప్రచారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావుకు.. ప్రజలు మంగళహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో నయా రూట్ - ఏఐ టెక్నాలజీతో ఖర్చు తగ్గించుకుంటున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.