ETV Bharat / state

Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 9:17 PM IST

Updated : Oct 6, 2023, 10:29 PM IST

Telangana Group 4
tspsc

21:11 October 06

Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-4 తుది కీ

Telangana Group 4 Final Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదలైంది. పేపర్-1 జనరల్​ స్టడీస్​లో ఏడు ప్రశ్నలు తొలగించగా.. మరో ఎనిమిదింటికి ఆప్షన్ మార్చారు. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించగా.. అయిదింటికి సమాధానాలు మార్చారు. ఆగస్టు 28న ప్రాథమిక 'కీ' విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో తుది 'కీ' విడుదల చేశారు.

TSPSC That No Mistakes in Group 1 Prelims Exam : గ్రూప్​-1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదు: టీఎస్​పీఎస్సీ

TS Group-4 Exam 2023 Final Key : రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 పరీక్షకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా .. 7 లక్షల 60వేల మంది రాశారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1 జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 సెక్రటేరియల్​ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు. గ్రూప్-4 పరీక్షకు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడ్డారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు.

TSPSC Appeal Petition Against Group 1 Prelims Cancellation : అప్పీల్​ పిటిషన్​ వేసేందుకు సిద్ధమవుతోన్న TSPSC.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు

High Court Division Bench on Group 1 exam cancellation : గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందే.. TSPSC అప్పీలును కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం

Last Updated :Oct 6, 2023, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.