ETV Bharat / state

నీరా పాలసీపై ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

author img

By

Published : Aug 24, 2020, 6:25 PM IST

రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్థులకు ప్రయోజనం కలిగించేలా ప్రకటించిన నీరా పాలసీపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో నీరా విధానం గురించి ఆబ్కారీ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

telangana excise minister srinivas goud reviw on neera policy in telangana
నీరా పాలసీపై ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా పాలసీపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ఆబ్కారీ అధికారులతో నీరా విధానం గురించి సుదీర్ఘంగా చర్చించారు. నీరా సేకరణ, నిల్వ, మార్కెటింగ్​తో పాటు నీరా కేఫ్​ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తాటి, ఊత చెట్ల నుంచి తయారు చేసే నీరా... క్యాన్సర్​ను అడ్డుకుంటుందని మద్రాస్ లేబరేటరీ ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్న వారి కోసమే నీరా పాలసీ తీసుకొస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.