ETV Bharat / state

Telangana EAMCET 2023 : ఈనెల 28న ఎంసెట్ నోటిఫికేషన్

author img

By

Published : Feb 24, 2023, 12:35 PM IST

Updated : Feb 24, 2023, 1:08 PM IST

Telangana EAMCET 2023 exam schedule : రాష్ట్రంలో ఎంసెట్​, పీజీఈసెట్​ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 28న ఎంసెట్​, పీజీఈసెట్​ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి.

mset
ఎంసెట్​

TS EAMset 2023 Notification Release: ఎంసెట్ 2023 షెడ్యూలు నోటిఫికేషన్​ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయడానికి షెడ్యూల్​ను ప్రకటించింది. ఎంసెట్​ ఆన్​లైన్​ అఫ్లికేషన్లను మార్చి 3 నుంచి స్వీకరించనున్నారు. దరఖాస్తుల​ స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్​ 10వగా ఉంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఏప్రిల్​ 12 నుంచి 14 వరకు ఛాన్స్​ ఇవ్వనున్నారు.

అపరాధ రుసుం: రూ.250 అపరాధ రుసుముతో ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్​ 15గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రూ.500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్​ 20వరకు గడువు పెంచనున్నారు. రూ.2500లతో అపరాధ రుసుముతో ఏప్రిల్ ​25వరకు గడువు ఇవ్వనున్నారు. 30వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్​ టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది.

మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్​ పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్​ విభాగ ప్రవేశ పరీక్షలలో మొదటి పరీక్ష మే 7 మధ్యాహ్నం జరగనుంది. అలాగే మే 8,9వ తేదీల్లో రెండు పూటల ఈ విభాగానికి సంబంధించిన పరీక్షను జరపునున్నారు. అలాగే అగ్రికల్చర్​ & మెడిసిన్​ విభాగాల ప్రవేశ పరీక్షలో మే 10, 11న రెండు పూటల ఆయా సబ్జెట్​లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

పీజీఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల: ఈనెల 28న పీజీఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల కానుందని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. మార్చి 3 నుంచి ఏప్రిల్​ 30 వరకు పీజీఈసెట్​కు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 24 వరకు పీజీఈసెట్​ దరఖాస్తుల ఆహ్వానిస్తారు. మే21 నుంచి పీజీఈసెట్​ హాల్​ టిక్కెట్లు డౌన్​లోడ్​ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. మే 29 నుంచి జూన్​1 వరకు పీజీఈసెట్​ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 24, 2023, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.