ETV Bharat / state

Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 1:33 PM IST

Updated : Aug 24, 2023, 10:25 PM IST

TS DSC Notification 2023
Telangana DSC Notification 2023

13:31 August 24

Telangana DSC Notification 2023 : రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana DSC Notification 2023 : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న సర్కార్ ఇప్పుడు మరో నోటిఫికేషన్(Job Notification Telangana 2023) ప్రకటనతో తీపికబురు అందించింది. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

మతిస్థిమితం లేనివాడనుకున్నారు.. ఏకంగా డీఎస్సీ పోస్టు కొట్టేశారు..

DSC Notification Telangana 2023 : హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి సబితా(Minister Sabitha Indrareddy) మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల నుంచి కళాశాలలు, యూనివర్సిటీలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మరోవైపు నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేశామని.. ఇప్పుడు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని వివరించారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ 2008 డీఎస్సీ మహిళా అభ్యర్థుల ధర్నా

'రాష్ట్రంలో సర్కార్ బడులను కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించాం. అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయి.' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

సెప్టెంబరు 15 నుంచి టెట్​ పరీక్షల నిర్వహణ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్​ను మరోసారి నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. మరుసటిరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్​టికెట్లు వెబ్​సైట్​లో సెప్టెంబరు 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పేపర్​ 1.. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్​ 2 పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy Letter to CM KCR : 'డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం'

'ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి'

Komatireddy Venkatareddy : 'ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్​.. లేదంటే రాజీనామాకు సిద్ధం'

Last Updated :Aug 24, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.