ETV Bharat / state

'ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి'

author img

By

Published : Feb 3, 2020, 9:43 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్ల నుంచి సాగుచేసుకుంటున్న ఆదివాసీల వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదివాసులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని కోరారు.

Tribal's Demand for  Special DSC
'ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి'

అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పలువురు ఆదివాసీలు ఆదిలాబాద్‌ జిల్లాలో డిమాండ్ చేశారు. టీఆర్టీలో శాస్త్రీయ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని వెంటనే ఆదివాసులకు న్యాయం జరిగేలా చూడలని కోరారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో మినీ ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అడవులలో నివసిస్తున్న తమకు అన్ని రంగాల్లో రాణించేలా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్యకు సమర్పించారు. ప్రభుత్వం చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

'ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి'

ఇదీ చదవండిః భారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.