ETV Bharat / state

బీజేపీ కార్నర్​ సమావేశాలపై బండి సంజయ్​ రివ్యూ.. లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశాలు

author img

By

Published : Feb 26, 2023, 5:54 PM IST

Bandisanjay review meeting on BJP corner meetings: బీజేపీ కార్నర్​ సమావేశాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో సమన్వయ కర్త కాసం వెంకటేశ్వర్లు మరికొందరి నేతలతో ఆయన సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు కార్నర్​ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

Bandisanjay
Bandisanjay

Bandisanjay review meeting on BJP corner meetings: బీజేపీ కార్నర్‌ సమావేశాలు నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసేటట్లు చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కార్నర్‌ సమావేశాలు, బీజేపీ నేతలపై ప్రభుత్వం చేస్తున్న దాడులపై ఆయన సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని కార్నర్‌ సమావేశాలు పూర్తి చేశారో వాటిపై సమీక్ష నిర్వహించారు.

ముందుగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11వేలకు పైగా కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని పార్టీ లక్ష్యంగా చేసుకుంది. అయితే గడిచిన పది రోజుల్లో కేవలం 6వేల కార్నర్​ సమావేశాలు మాత్రమే పూర్తి కాగా.. మిగిలిన మరో 5వేల కార్నర్‌ సమావేశాలు మరో మూడు రోజుల్లో పూర్తి చేసేట్లు చూడాలని సమన్వయ కర్తలకు బండి సంజయ్​ సూచించారు. ఈ మూడు రోజుల్లో ఐదు వేల కార్నర్​లు పూర్తయ్యేట్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంత వరకు ఏయే జిల్లాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేదో అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఆయా జిల్లాలకు పరిశీలకులుగా పంపించి.. మూడు రోజుల్లో పూర్తయ్యేట్లు జిల్లా అధ్యక్షులు చొరవ చూపాలని కార్నర్‌ సమావేశాల సమన్వయ కర్త వెంకటేశ్వర్లకు స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు వారి అభిప్రాయాలను బండి సంజయ్​తో పంచుకున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజక వర్గాల బలోపేతమే లక్ష్యంగా బీజేపీ తగు వ్యూహాలు రచిస్తోంది. ప్రతి నియోజవర్గంలోని సమన్యయ కర్తలతో మీటింగ్​ ఏర్పాటు చేసి గ్రామ, మండల స్థాయి నాయకులను సమన్వయం చేస్తున్నారు. వచ్చే నెలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తెలంగాణ పర్యటనను సైతం ఆ పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఆయన అధికార కార్యక్రమాలు అనంతరం పార్లమెంట్​ ప్రవాస్​ యోజన్​ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం వస్తోంది.

ఇవీ చదవండి:

కేసీఆర్ లేకపోతే.. కేటీఆర్​ను ఎవరూ లెక్కచేయరు : బండి సంజయ్

తెలంగాణలో పేదల ప్రభుత్వం తీసుకువస్తాం : బీజేపీ

వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల ఆరా.. ప్రభుత్వానికి మూడు డిమాండ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.