ETV Bharat / state

బల్దియా పోరులో సై అంటున్న విద్యావంతులు

author img

By

Published : Nov 24, 2020, 3:15 PM IST

జీహీచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి ఈసారి విద్యావంతులు ఎక్కవగా ఆస్తకి చూపారు. బరిలో ఉన్నవారిలో పీహెచ్‌డీ చేసిన వారితో పాటు డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీలు చేసిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో 21 ఏళ్ల అతి చిన్న వయస్కురాలైన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అమీనా సమ్రీన్ నల్లకుంట డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 75 ఏళ్ల అత్యంత ఎక్కువ వయస్సు గల అభ్యర్థిగా కాజా సూర్యనారాయణ జూబ్లీహిల్స్ డివిజన్ తెరాస నుంచి బరిలో నిలిచారు.

బల్దియా పోరుకు ఆసక్తి చూపిన విద్యావంతులు
బల్దియా పోరుకు ఆసక్తి చూపిన విద్యావంతులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యావంతులు ఎక్కువగా బరిలో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఎక్కువ సంఖ్యలో విద్యావంతులు పోటీ చేస్తున్నారు. గ్రేటర్​లోని మొత్తం 150 డివిజన్​లకు 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పీహెచ్​డీ చదువుకున్న వారితో పాటు నిరక్షరాస్యులు సైతం కొందరు పోటీ చేస్తున్నారు. అసిఫ్​నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పీహెచ్​డీ పూర్తి చేసిన లుబ్నా సార్వంత్ పోటీలో నిలిచారు. వీరితో పాటు ఆరుగురు వైద్యులు సైతం బరిలో నిలిచారు.

ఇంటర్ నుంచి ఎంటెక్ వరకు...

ఎంటెక్ చదివిన వారు ముగ్గురు, బీటెక్ చదివిన వారు 14 మంది గ్రేటర్ వార్​లో తలపడుతున్నారు. న్యాయశాస్త్రం చదివిన వారు 13 మంది, పీజీలు చేసిన వారు 98 మంది, గ్రాడ్యుయేషన్ చేసిన వారు 220 మంది నగరంలోని పలు డివిజన్ల నుంచి పోటీ చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన 345 మంది, డిప్లొమా 5, ఇంటర్మీడియట్ 68 మంది పోటీ చేస్తున్నారు.

39 మంది నిరక్షరాస్యులు...

పదో తరగతి చదివిన వారు 159, తొమ్మిదో తరగతి చదివిన వారు 17 మంది, ఎనిమిదో తరగతి చదివిన వారు 10, ఏడో తరగతి చదివిన వారు 22, ఆరో తరగతి చదివిన వారు 4, ఐదో తరగతి 7 గురు, నాలుగో తరగతి ఇద్దరు, ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకున్న వారు ఒకరు, పదో తరగతి ఫెయిలైన వారు నలుగురు, విద్యార్హతలు చెప్పని వారు 50 మందికి పైగా ఉన్నారు. నిరక్షరాస్యులు 39 మంది నగరంలో పోటీ చేస్తున్నారు.

నల్లకుంట నుంచి సమ్రీన్...

నల్లకుంట నుంచి ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల అమీనా సమ్రీన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. 21 ఏళ్ల వయస్సున్న వారు మొత్తం 8 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు బరిలో ఉన్నారు. 75 ఏళ్ల సూర్యనారాయణ తెరాస జూబ్లీహిల్స్ డివిజన్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 71 ఏళ్ల వయస్సు గల కొప్పు రాజయ్య మల్కాజిగిరి స్వతంత్ర అభ్యర్థిగా గ్రేటర్​లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: సూటిగా అడుగుతున్నా.. సుత్తిలేకుండా చెప్పండి : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.