ETV Bharat / state

హైదరాబాద్​ రానున్న రాష్ట్రపతి .. ట్రయల్ రన్ నిర్వహించిన భద్రతా సిబ్బంది

author img

By

Published : Dec 24, 2022, 3:47 PM IST

Updated : Dec 24, 2022, 7:49 PM IST

President Conway Rehearsal: డిసెంబర్​ 28న రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో పోలీసు​లు రాష్ట్రపతి కాన్వాయ్​ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా రూట్​ మ్యాప్​ను పరిశీలించారు. ఈ రిహార్సల్​లో రాష్ట్రపతి భద్రత సిబ్బంది కూడా ఉన్నారు.

President Conway Rehearsal
రాష్ట్రపతి కాన్వే రిహార్సల్​

President Conway Rehearsal: శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం నుంచి రాజ్​భవన్​ వరకు పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు, రాష్ట్రపతి భద్రత సిబ్బంది రూట్ మ్యాప్​ను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నారు.

సుమారు మూడు పర్యాయాలు రాష్ట్రపతి నిలయం నుంచి రాజభవన్ వరకు కాన్వాయ్​తో రిహార్సల్స్ చేపట్టారు. డిసెంబర్​ 28 నుంచి 30 వరకు హైదరాబాద్​లో ఉండనున్నారు. అయితే రాష్ట్రపతి రాకపై అయోమయం నెలకొంది. కొవిడ్ ఉద్ధృతి కారణంగా షెడ్యూల్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రాత్రి వరకు స్పష్ఠత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.