ETV Bharat / state

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సర్వం సిద్ధం - పోలింగ్​కు ముందుగానే ఓటేసే అవకాశం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 7:20 PM IST

Postal Ballot Utilization in Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఎన్నికల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా.. ఓటర్లకు మరిన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌, ఈవీఎం కేటాయింపు వంటి పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సగం మాత్రమే ఆమోదం అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.

New Polling Stations Arrangements in Telangana
Postal Ballot Utilization in Telangana Assembly Elections 2023

Postal Ballot Utilization in Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 28,057 మందికి అనుమతించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు గుర్తింపు పొందిన జర్నలిస్టులు(Journalists), ఎన్నికల విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, దివ్యాంగులు తదితరులకు కలిపి మొత్తం 13 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఈసీ కల్పించింది.

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్

44,097 మంది 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ వాటిని పరిశీలించి 28,057 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా సిద్ధిపేటలో 752 మంది ఉండగా, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 లోపు మంది ఉన్నారు. నవంబర్ 30న పోలింగ్ ఉండటంతో అంతకు ముందుగానే వీరు ఓటు హక్కు(Right to vote) వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

New Polling Stations Arrangements in Telangana : అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియటం.. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడంతో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఈఓ(CEO) సత్యవాణి తెలిపారు. అందుకు అనుగుణంగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. శనివారం సాయంత్రం నాటికి ముద్రణ పూర్తవుతుందని.. గురువారం సాయంత్రం నుంచి చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాలయంలో ప్రింటింగ్‌ ప్రారంభమైనట్లు సత్యవాణి తెలిపారు.

హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తుకు తుదిగడువు రేపే

సీఈవో వికాస్‌రాజ్‌, పోలీసు ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు ఈసీ కేటాయించిన 13 విభాగాల వారు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అర్హులకు ముందస్తుగానే సమాచారం అందజేసి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పెరిగిన ఓటర్లకు అనుగుణంగా 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు(Poling Stations) కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని.. దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కు చేరుకొందని ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో సత్యవాణి వివరించారు.

EC Implement New Policy to Postal Ballots : ఎన్నికల సమయంలో విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది చాలా కీలకం. వారిలో చాలా మందికి సొంత ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహించే అవకాశం ఉండదు. దీంతో వారు తమ ఓటుహక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వారి సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. తమ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్​ను తీసుకొని ఓటు వేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది.

election commission official 12 cards : ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా​ ప్రకటించిన.. 12 గుర్తింపు కార్డులివే

CEO Vikas Raj Review on Voter Enrolment in Hyderabad : 'ఓటు హక్కు నమోదు చేసుకునేలా.. ఓటర్లను చైతన్య పరచాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.