ETV Bharat / state

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ - చివరి తేదీ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 7:35 PM IST

Updated : Jan 12, 2024, 10:05 PM IST

TSPSC Chairman Notification Details
TSPSC Chairman and Persons Notification

Notification for TSPSC Chairman and Persons Recruitment : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ కూడా రాజీనామా చేశారు.

Notification for TSPSC Chairman and Persons Recruitment : రాష్ట్రంలో కొత్త సర్కార్‌ వచ్చిన తరవాత టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్దన్ రెడ్డి, ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సీఎస్ శాంతికుమారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను secy-ser-gad@telangana.gov.inకు మెయిల్ చేయాలని సీఎస్ తెలిపారు.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు ​- త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు ముమ్మరం

TSPSC Chairman Recruitment Notification : దరఖాస్తుతో పాటు అర్హతలు, విధివిధానాలను నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీలో ఛైర్మన్ సహా 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంటుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, టీఎస్‌పీఎస్సీ నియమావళి ప్రకారం సంస్థ ఛైర్మన్, సభ్యుల అర్హతలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కమిషన్‌లోని సభ్యుల్లో కనీసం సగం మంది కేంద్రంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో పదేళ్లు ఉద్యోగం చేసిన వారై ఉండాలని పేర్కొంది. మిగతా సభ్యులను అకడమిక్, మేనేజ్‌మెంట్, న్యాయ, శాస్త్ర, సాంకేతిక, హ్యుమానిటీస్ రంగాల్లో ప్రముఖల నుంచి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

TSPSC Latest Notification : టీఎస్‌పీఎస్సీ ఉద్దేశాలను, నిష్పక్షపాతంపై ప్రజల్లో విశ్వాసం నింపగలిగే నిజాయతీ, సమర్థత గల వారిని ఛైర్మన్, సభ్యులుగా ఎంపిక చేయాలని రాజ్యాంగం నిర్దేశించిందని ప్రభుత్వం నోటిఫికేషన్‌(TSPSC Chairman Notification)లో తెలిపారు. ఆరేళ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్న ఛైర్మన్, సభ్యుల గరిష్ఠ వయోపరిమితి 62 ఏళ్లుగా నిర్ణయించింది టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా గతంలో పదవీకాలం ముగిసిన వారు మరోసారి నియామకానికి అనర్హులుగా ప్రకటించింది. దరఖాస్తులు లేదా ఇతర పద్ధతుల ద్వారా కమిషన్ ఛైర్మన్, సభ్యులను సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని సీఎస్ వెల్లడించారు.

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Sumitra Anand Tanobab Resign to TSPSC Job : టీఎస్‌పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా(Sumitra Anand Tanobab Resign ) కూడా రాజీనామా చేశారు. ఛైర్మన్ బి. జనార్దన్ రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్. సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా సుమిత్ర ఆనంద్ ఇవాళ గవర్నర్ తమిళిసైకి రాజీనామా పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని సుమిత్ర ఆనంద్ పేర్కొన్నారు. జరిగిన దుష్పరిణామాల్లో సభ్యుల ప్రమేయం లేకపోయినప్పటికీ ప్రక్షాళన అంటే కమిషన్ మార్చడమే అనే విధంగా ప్రచారం జరగడం బాధ కలిగించిందని ఆమె అన్నారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా - అశోక్​నగర్​లో నిరుద్యోగుల సంబురాలు

Last Updated :Jan 12, 2024, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.