ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్​ తమిళి సై

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 3:09 PM IST

Updated : Jan 10, 2024, 3:51 PM IST

Governor Tamilisai Accepts TSPSC Chairman and Members Resignations
TSPSC Chairman and Members Resignations

Governor Tamilisai Accepts TSPSC Chairman and Members Resignations : గత 15 రోజుల నిరీక్షణకు నేటితో తెరపడింది. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​, సభ్యుల రాజీనామాలను గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ ఆమోదించారు. ఇప్పుడు నూతనంగా కమిషన్​ ఛైర్మన్​ సభ్యులను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లభించింది.

Governor Tamilisai Accepts TSPSC Chairman and Members Resignations : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(TSPSC)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదవులకు రాజీనామా చేసిన కమిషన్​ ఛైర్మన్​, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్​ తమిళిసై సౌందర్య రాజన్(​Governor Tamilisai) ఆమోదించారు. ప్రభుత్వ లేఖ, న్యాయ నిపుణుల సలహా అనంతరం ఈ మేరకు తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి గవర్నర్​ సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ జనార్ధన్​ రెడ్డి సహా సభ్యులు ఆర్​. సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారెం జనార్దన్​ రెడ్డి రాజీనామాలను గవర్నర్​ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో కొత్త కమిషన్​ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్​పీఎస్సీ ఫలితాలు మాత్రం ప్రకటించలేదు. కొత్తగా ఛైర్మన్​, సభ్యుల నియాకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం

Telangana Public Service Commission : ఇప్పుడు రాజీనామా చేసిన ఛైర్మన్​, సభ్యుల్లో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం హయాంలో నియామకం కాగా, అప్పట్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, నిరుద్యోగుల ఆందోళనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే టీఎస్​పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మొదటి సమీక్షను నిర్వహించారు. ఆ వెంటనే ఛైర్మన్​, సభ్యులు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు గత 15 రోజులుగా గవర్నర్​ వద్ద పెండింగ్​లో ఉన్నాయి. అయితే సిట్​ దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా గవర్నర్​ కోరారు. సిట్​ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఛైర్మన్​, సభ్యుల రాజీనామాలను ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ నలుగురి రాజీనామాలకు బుధవారం ఆమోద ముద్ర వేశారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదంతో గవర్నర్ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మంగళవారమే పంపించారని వెంటనే బుధవారం గవర్నర్ ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది. గత ఛైర్మన్, సభ్యుల హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలపై విచారణ కొనసాగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. రాజీనామాలకు ఆమోదం లభించడంతో పాటు కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసి స్పష్టతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ నేడో, రేపో చేపట్టనుంది.

ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని గతంలో హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ సహా పదిమంది సభ్యులను నియమించేందుకు అవకాశం ఉంటుంది. సభ్యులు కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్ రాజీనామా చేయలేదు. ఛైర్మన్​ తో పాటు అయిదుగురు సభ్యులను నియమించే అవకాశం కనిపిస్తోంది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్

టీఎస్​పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ : సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated :Jan 10, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.