ETV Bharat / state

MLA quota MLC Election: ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు

author img

By

Published : Nov 16, 2021, 4:19 PM IST

MLA quota MLC Election, MLC elections 2021
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLA quota MLC Election) నామినేషన్ల గడువు ముగిసింది. ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. వారిలో ఆరుగురు తెరాస అభ్యర్థులు కాగా... మిగతా ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక(MLA quota MLC Election) నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురు తెరాస అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మిగిలిన ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లను అధికారులు రేపు పరిశీలించనున్నారు.

తెరాస అభ్యర్థులు ఆరుగురు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు(TRS MLC candidates for MLA quota) ఖరారయ్యారు. ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. మధ్యాహ్నం వీరు తమ నామినేషన్లు సమర్పించారు.

చివరి నిమిషంలో ఇద్దరు

జాబితాలో చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌, వెంకట్రామ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అభ్యర్థుల ఎంపిక కోసం భారీ కసరత్తే జరిగింది. జాబితాలో ఆకుల లలిత కొనసాగింపుతో పాటు మధుసూధనాచారికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు రాగా.. చివరి నిమిషంలో అంతా తారుమారైంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఆ దస్త్రం పెండింగ్​లో..

సిద్దిపేట కలెక్టర్‌(siddipet former collector)గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డిని పెద్దల సభకు పంపించాలని తెరాస నిర్ణయించింది. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్‌ చేసినా.. ఆ దస్త్రం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయన చేసిన సామాజిక సేవ పరిశీలించాలని గవర్నర్‌ ప్రకటించారు. ఈ పరిణామాలతో కౌశిక్‌రెడ్డి(Padi Kaushik reddy)ని శాసనసభ్యుల కోటాలో మండలికి పంపించాలని గులాబీ అధినేత నిర్ణయించారు.

షెడ్యూల్ ఇదే..

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నెల 29న ఉ.9 నుంచి సా.5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్​ను కూడా ఈసీ విడుదల చేసింది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: TRS MLC candidates for MLA quota : ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.