ETV Bharat / state

New Voter ID Application : కొత్త ఓటర్​ ఐడీ కార్డు పొందడం ఇంత తేలికా.. అయితే ఇప్పుడే అప్లై చేసేద్దాం..

author img

By

Published : Aug 13, 2023, 1:41 PM IST

New Voter ID Application : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మీరు ఓటర్​ ఐడీ కలిగి ఉన్నారా..? 18 సంవత్సరాలు నిండి.. భారతీయ పౌరుడై ఉంటే చాలు.. ఓటర్​ ఐడీ పొందేందుకు మీరూ అర్హులే అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. కొత్త ఓటర్​ ఐడీ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి.. ఏ ఏ పత్రాలు కావాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

New Voter ID Application in telugu
New Voter ID Application

New Voter ID Application : తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2023 (Telangana Assembly Elections 2023) జరగనున్నాయి. దీంతోపాటు పార్లమెంట్​ ఎన్నికలకూ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు ఐడీ కీలకం. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఓటరు గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. అయితే ఓటర్​ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్​లైన్​ సర్వీస్​ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద గంటల కొద్దీ క్యూలో వేచి చూడాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని.. మీ మొబైల్​ నుంచే అప్లై చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కొత్తగా ఓటర్​ ఐడీ కోసం అప్లై చేసే వారు ఇవి ఫాలో అవ్వండి..

ముందుగా అధికారిక వెబ్​సైట్​ NVSP (National Voter's Service Portal)ని సంప్రదించాలి.

National Voter's Service Portal లింక్​పై క్లిక్​ చేస్తే మరో పేజీలోకి రీడైరెక్ట్​ అవుతుంది.

అక్కడ ఎడమ వైపున FORMS.. కుడివైపున SERVICES అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

FORMS సెక్షన్​లోకి వెళితే.. అక్కడ ఫారం-6 కనిపిస్తుంది.

దానిపై క్లిక్​ చేస్తే.. మరో పేజీలోకి తీసుకెళ్తుంది.

అక్కడ LOGIN/ SIGN UP అని అడుగుతుంది.

Dalit Bandhu Scheme Second Phase : త్వరలో 'దళితబంధు' రెండో విడత.. ఈ అర్హతలు, పత్రాలు, మీరు కలిగి ఉన్నారా..?

కొత్త యూజర్​ అయినట్లయితే మీ మొబైల్​ నెంబర్ ఎంటర్​ చేయడం ద్వారా SIGN UP కావాల్సి ఉంటుంది.

SIGN UP పూర్తయిన వెంటనే LOGIN పేజీలోకి తీసుకెళ్తుంది.

ఇక్కడ మీ ఫోన్​ నెంబర్​, పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి లాగిన్​ అవ్వాలి.

లాగిన్​ అయ్యాక అక్కడ కనిపించే ఫారం-6లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

New Voter ID Application in telugu
New Voter ID Application

మీ వివరాలు నింపే క్రమంలో కొన్ని పత్రాలు జత చేయాల్సి ఉంటుంది..

1. పాస్​పోర్ట్​ సైజ్ ఫొటో

2.డేట్​ ఆఫ్​ బర్త్​ ఫ్రూఫ్​ కోసం మీ ఆధార్​ కార్డు

3.రెసిడెన్స్​ ఫ్రూఫ్​ కోసం మీ తండ్రి/భర్త ఆధార్​ కార్డు

Ration card Application Status in Telangana : రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తు అలా..

ఈ వివరాలన్నీ ఇచ్చాక.. ఓసారి PREVIEW చెక్​ చేసుకోండి.

అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Preview and Submitపై క్లిక్​ చేస్తే సరి.

మీ అప్లికేషన్ సక్సెస్​ఫుల్​ అని స్క్రీన్​పై చూపిస్తుంది. దాంతోపాటు Reference Number జనరేట్ అవుతుంది.

ఈ Reference Numberను జాగ్రత్తగా పెట్టుకోండి.

తర్వాత మీ అప్లికేషన్​ స్టేటస్​ను చూసుకునేందుకు ఈ నెంబర్​ కీలకం.

చివరగా ఓ వారం తర్వాత చెక్​ చేసుకుంటే.. మీ కొత్త ఓటర్​ ఐడీ కార్డు మీ కళ్ల ముందు కనిపిస్తుంది.

అన్నట్లు చెప్పడం మరిచితిని.. మీ కొత్త ఓటర్​ ఐడీ అప్లికేషన్​ కోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో.. చూశారుగా.. ఇంట్లోనే కూర్చుని రూపాయి ఖర్చు లేకుండా.. 10 నిమిషాల్లో ఓటర్​ ఐడీకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకోండి.

New Voter ID Application in telugu
New Voter ID Application

Minority 1 Lakh Scheme in Telangana : మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఇవీ అర్హతలు.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

మీ ఓటర్​ ఐడీ స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి..

అధికారిక వెబ్​సైట్​ NVSPని సంప్రదించాలి.

అక్కడ కనిపించే National Voter's Service Portal లింక్​పై క్లిక్​ చేయాలి.

మరో పేజీలో ఎడమ వైపున FORMS.. కుడివైపున SERVICES అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

SERVICES సెక్షన్​లో TRACK Application Status అనే ఆప్షన్​ కనిపిస్తుంది​.

అక్కడ మీ Reference Number ఎంటర్ చేసి, STATE సెలెక్ట్​ చేసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్​ తెలుసుకోవచ్చు.

New Voter ID Application in telugu
New Voter ID Application

ఓటర్​ ఐడీతో ఆధార్ లింక్ చేశారా?.. గడువుపై కేంద్రం కీలక నిర్ణయం

'ఉమ్మడి ఓటరు జాబితా'పై కేంద్రం కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.