ETV Bharat / state

Telangana Tourism : రాష్ట్రంలో మైమరిపించబోతున్న టూరిస్ట్ ప్రాంతాలు.. ఇవే..!

author img

By

Published : May 4, 2023, 2:22 PM IST

upcoming tourist places in Telangana
మురిపించబోతున్న పర్యాటక ప్రదేశాలు.. అవేంటో తెలుసా?

Telangana Tourism: తెలంగాణలో పర్యాటకానికి కొత్త జోష్ వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలతో.. కొత్త కొత్త ప్రాజెక్టులతో అత్యంత సుందరంగా రాష్ట్రం తయారవుతోంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన 125అడుగుల అంబేడ్కర్ విగ్రహం, ఇంద్రభవనం లాంటి సచివాలయం, ఆవిష్కరించ బోతున్న అమరవీరుల స్మారక నిర్మాణం ఇవన్నీ ప్రస్తుతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

Telangana Tourism: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పర్యాటకానికి పెట్టిన పేరుగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త ఆవిష్కరణలు, కట్టడాలతో రాష్ట్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది. అలాగే తెలంగాణ కళాసంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర సచివాలయం.. ఇవన్నీ రాష్ట్ర రాజధానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇవేగాక నెక్లెస్​రోడ్డులో, ట్యాంక్​బండ్​కు సమీపంలో నీరా కేఫ్ ప్రారంభమైంది. వీటికి సమీపంలోనే త్వరలో అమరవీరులు స్మారక కేంద్రం ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటిలో భాగంగా ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను వినోదం, టూరిస్ట్ కేంద్రాలుగా తీర్చిదిద్దే ఆలోచన కార్యరూపం దాల్చనుంది. టూరిస్ట్​ల వసతికి కొత్తగా ఐదు బడ్జెట్ హోటళ్లను పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించబోతుంది. ఒక్కో హోటల్​లో సుమారు 20 గదులుంటాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న బడ్జెట్ హోటల్, ఒక రిసార్టు అందుబాటులోకి రానున్నాయి. మహాబూబ్​నగర్, సిద్దిపేటలో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నారు.

upcoming tourist places in Telangana
మానేరు రివర్ ఫ్రంట్

ఐటీ, విదేశీ పర్యాటకులు లక్ష్యంగా: రూ.110కోట్ల వ్యయంతో రంగనాయకసాగర్​ను సిద్దిపేటకు 10కిలోమీటర్లు దూరంలో అభివృద్ధి చేయనున్నారు. రంగనాయకసాగర్ జలాశయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు.ఈ ప్రాజెక్టును ప్రధానంగా విదేశీ పర్యాటకులను, ఐటీ ఉద్యోగులను ఆకర్షించే లక్ష్యంగా ఏర్పాటుచేశారు. జల వినోదం కోసం వాటర్ రిసార్టులు, వాటర్ ఫ్రంట్ ఫుడ్ కోర్ట్, ఒకేసారి 2వేస మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాలు, పిల్లలకు ప్రత్యేకంగా వాటర్ పార్కులు వంటి అనేక ఆకర్షణలు ఇక్కడ రాబోతున్నాయని టూరిజం కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి.

upcoming tourist places in Telangana
రంగనాయకసాగర్ జలాశయం

సిద్దిపేటలో నిర్మించనున్న శిల్పారామం: సిద్దిపేటలోని కోమటిచెరువు ఇప్పటికే పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది. దీని పక్కనే 25 కోట్ల రూపాయలతో శిల్పారామం, పన్నెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో డైనోసార్ థీం పార్కు నిర్మించబోతున్నారు. ప్రసిద్ధి చెందిన పాలకుర్తి సోమశ్వర ఆలయానికి వచ్చే భక్తుల వసతికి బడ్జెట్ హోటల్​ నిర్మాణపనులు త్వరలో ప్రారంభం అవనున్నాయి.

upcoming tourist places in Telangana
మహబూబ్​నగర్ శిల్పారామం ముఖద్వారం

అభయారణ్యంలో అద్దాల ఇల్లు: అడవిలో కాటేజీలు, అద్దాల ఇల్లులు ఇవి ప్రజలను అత్యధికంగా ఆకర్షిస్తాయి. కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో 10.77 కోట్ల రూపాయల వ్యయంతో ఎకోటూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేశారు. ఇక్కడ తొమ్మిది కాటేజీలు (జీ ప్లస్‌ 1), అద్దాల ఇల్లు (జీ ప్లస్‌ 2), నీళ్లపై నడుచుకుంటూ వెళ్లేందుకు జెట్టీ, ఫుడ్‌కోర్టు ఇక్కడి ప్రత్యేకతలు. ఇవి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. కొత్తగూడెంలో బడ్జెట్‌ హోటల్‌, మహబూబ్‌నగర్‌ శిల్పారామం కూడా ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది.

upcoming tourist places in Telangana
మన్యంకొండ వద్ద రోప్​వే నమూనా

రాష్ట్రంలోనే మొదటిసారి 650 మీటర్ల రోప్‌పే: మహబూబ్‌నగర్‌కు దగ్గరలో ఉన్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే కొండపైకి వెళ్లటానికి ఘాట్ రోడ్డు ఉండగా.. ప్రస్తుతం కింది నుంచి పైకి 650 మీటర్ల దూరం రోప్‌వే నిర్మించబోతున్నారు. ఇలాంటి రోప్​వే రాష్ట్రంలోనే మొదటిదిగా అధికారులు చెబుతున్నారు. ఇక్కడ అన్నదాన సత్రం, 50కోట్ల రూపాయల వ్యయంతో రోప్​వే నిర్మించనున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లో పెద్దచెరువు సుందరీకరణ కూడా చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.