ETV Bharat / entertainment

ప్రభాస్​ 'బుజ్జి'- వీరలెవల్​లో గ్రాండ్​ ఎంట్రీ- హైఓల్టేజ్​ ప్యాక్డ్ గ్లింప్స్​ చూశారా? - Prabhas Kalki 2898 AD

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 9:42 PM IST

Prabhas Kalki 2898 AD event Bujji : సైన్స్ ఫిక్షన్​ మూవీ కల్కి 2898 AD నుంచి బుజ్జి గ్లింప్స్ వచ్చేసింది. ఇందులో బుజ్జితో కలిసి ప్రభాస్ చేసిన యాక్షన్స్ సీక్వెన్స్​ అదిరిపోయాయి.

Prabhas Kalki
Prabhas Kalki (ETV Bharat)

Prabhas Kalki 2898 AD event Bujji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్​ మూవీ కల్కి 2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్​తో నిర్మస్తోంది. అయితే రీసెంట్​గానే ఈ చిత్రంలోని బుజ్జి అనే ఓ స్పెషల్ క్యారెక్టర్​ను మేకర్స్​ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లైఫ్​లో స్పెషల్ పర్సన్​గా ఉన్న ఓ రొబోటిక్​ కారు ఈ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. దీనికి మహానటి కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందిస్తోంది. సినిమాలో ప్రభాస్​తో పాటుగా ఈ పాత్ర కీలకంగా ఉండబోతుందని మేకర్స్​ చెబుతున్నారు.

దీంతో ఈ బుజ్జి ఎలా ఉంటుందా అనే ఆసక్తి, ఉత్కంఠ అందరిలో నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠతకు తెరదించుతూ బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేశారు మేకర్స్. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో ఓ స్పెషల్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించి అభిమానుల సమక్షంలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభాస్​ వీరలెవల్​లో తన బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్​లో తన కారుతో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్​లో జోష్ నింపేశారు. అనంతరం సినిమాలో బుజ్జితో కలిసి ప్రభాస్ చేసిన హాలీవుడ్ రేంజ్​ యాక్షన్స్ సీక్వెన్స్​ గ్లింప్స్​ను స్క్రీనింగ్ చేశారు.

ఆ వీడియోలో "ఒక్కరోజు పాజిటివ్​గా ఉండు బుజ్జి ప్లీజ్ అని చెబుతూ ప్రభాస్ చేసిన యాక్షన్ హంగామా మాములుగా లేదు. చివరికి "ఇక తిరిగి వెళ్లేది లేదు. లవ్​ యూ బుజ్జి" అని ప్రభాస్ అనగా బుజ్జి పర్లేదులే అంటూనే గ్లింప్స్​ను ముగించారు. మొత్తంగా ఒక్కో సీన్ హాలీవుడ్నే తలదన్నేలా సీన్స్​తో చూపించారు గ్లింప్స్.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ "అన్నింటికన్నా ముఖ్యమైన విషయం అమితాబ్ బచ్చన్​, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. మీరు మా సినిమాలో నటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మొత్తం ఇండియా ఈ ఇద్దరినే స్ఫూర్తిగా తీసుకుంది. మా ఫ్యామిలీ మొత్తం అమితాబ్​ బచ్చన్ ఫ్యాన్స్​. నార్త్ నుంచి ఇంత మంది అభిమానులను సంపాదించుకుంది ఆయనే. ఆయన​ సూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. అలాంటి నటుడు ఇండియాలో ఉన్నందుకు గర్వంగా ఉంది. చిన్నప్పుడు కమల్​హాసన్ సాగర సంగమం చూసి ఆయన వేసుకున్న దుస్తులే కావాలని అడిగాను. అలాంటి బట్టలే కుట్టించుకున్నాను.​ ది మోస్ట్ గార్జియస్​, సూపర్ స్టార్ దీపికా పదుకొణె లాంటి ఇంటర్నేషనల్ స్టార్ మా సినిమాలో నటించడం లక్కీగా భావిస్తున్నాను. దిశా కూడా హాట్ స్టార్​. ఈ వయసులోనూ దత్​ గారి ప్యాషన్​ చూసి ఆశ్చర్యపోతున్నాను. 50ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనే. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. లవ్ యూ ఆల్​" అని పేర్కొన్నారు.

కాగా, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ , లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె లుక్స్​ రిలీజ్ అయ్యాయి. మరో పాత్రలో దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సినిమాలో ప్రభాస్​ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. .మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో కథ సాగుతుందని మూవీటీమ్ చెబుతోంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించి సినిమాను రూపొందిస్తున్నారట. సినిమాను మేకర్స్ జూన్ 27న ఎంతో గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.