ETV Bharat / state

Lokesh: చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకే బీపీ వస్తుంది.. జగన్​కు లోకేశ్ కౌంటర్

author img

By

Published : Oct 20, 2021, 6:37 PM IST

ఏపీ సీఎం జగన్ రెడ్డి... సైకో, శాడిస్ట్ అని నిన్నటి ఘటనతో తేలిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు(nara lokesh fires on cm jagan). పెంపుడు కుక్కల్ని తమపైకి పంపి... జగన్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే మాట్లాడేందుకు జగన్ రెడ్డి రావాలని లోకేశ్ సవాల్ విసిరారు.

lo
lo

దాడులు చేసినంత మాత్రాన తాము భయపడమని.. ప్రభుత్వంపై చేసే తప్పులపై పోరాడుతున్నామన్నారు నారా లోకేశ్(nara lokesh fires on cm jagan news). ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి సంబంధాలుంటున్నాయని ఆరోపించారు. ఏపీ నుంచి గంజాయి ఎక్కువగా వస్తోందని హైదరాబాద్ సీపీ చెప్పారని లోకేశ్‌ గుర్తు చేశారు. గంజాయి నివారణలో తెలంగాణకు ఉన్న చిత్తశుద్ధి ఏపీకి లేదన్నారు.

చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకే బీపీ వస్తుంది.. జగన్​కు లోకేశ్ కౌంటర్

'4 అద్దాలు పగిలితే భయపడతామని భావిస్తున్నారా..? రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి. దుండగుల కార్లు డీజీపీ కార్యాలయం మీదుగానే వచ్చాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారు. తెదేపా కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు రాకూడదా? తెదేపా కార్యకర్తలు వస్తున్న అంబులెన్స్‌ను కూడా ఆపారు' - నారా లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

నడివీధిలో చంద్రబాబును కాల్చాలని జగన్‌ అన్నారా.. లేదా..? అని లోకేశ్‌ నిలదీశారు. చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకే బీపీ వస్తుందన్నారు. వైకాపా నేతలు పోలీసులను అనేక తిట్లు తిట్టారని.. కానీ వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. బూతులకు కేరాఫ్ అడ్రస్‌.. వైకాపా యూనివర్సిటీ అంటూ లోకేశ్‌ ఫైర్ అయ్యారు.

'మా నాయకుడికి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. మా అధినేతకు ఉన్న సహనం నాకు లేదు.. వడ్డీతో సహా చెల్లిస్తా. మీకు సరైన శిక్ష పడే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం. దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి విధించాలి. కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్‌పై పక్క రాష్ట్రం సీఎం స్పందించారు.. ఇక్కడి సీఎం స్పందించరా?' - నారా లోకేశ్‌

డీజీపీ తీరు మారాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో చట్టాలను అమలు చేయాలన్నారు. 2024లో తమదే అధికారమన్న లోకేశ్.. అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆఫీసుపై దాడి జరిగి 24 గంటలైనా ఒక్కరినీ అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి

ap dgp: తెదేపా కార్యాలయంపై దాడి.. ఏపీ డీజీపీ ఏమన్నారంటే..?

చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష.. శనివారం అమిత్‌ షాతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.