ETV Bharat / state

MLA Tickets Clash in BRS : బీఆర్​ఎస్​లో రచ్చకెక్కుతోన్న ఎమ్మెల్యే టికెట్ల రగడ.. రేపే ఫస్ట్​ లిస్ట్ ప్రకటన​..!

author img

By

Published : Aug 20, 2023, 7:40 AM IST

BRS MLA Ticket Fight in Telangana : రాష్ట్ర అసెంబ్లీ సమరానికి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్న తరుణంలో అధికార బీఆర్ఎస్​లో టికెట్ల రగడ రచ్చకెక్కుతోంది. పలుచోట్ల సిట్టింగ్‌లకు టికెట్లు దక్కవని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలు నిన్న భగ్గుమనగా.. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అసమ్మతి బావుటా ఎగురవేశారు. మరోవైపు అభ్యర్థుల సర్దుబాటులో నిమగ్నమైన అధినేత.. అవసరమైతే వందకు పైగా ఒకేసారి వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో కామ్రేడ్‌లతో పొత్తు విషయంలోనూ గులాబీ పార్టీ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

BRS MLA Ticket Fight in Telangana
BRS MLA Ticket Fight

MLA Tickets Clash in BRS : బీఆర్​ఎస్​లో రచ్చకెక్కుతోన్న ఎమ్మెల్యే టికెట్ల రగడ.. రేపే ఫస్ట్​ లిస్ట్ ప్రకటన​..!

BRS MLA Ticket Fight in Telangana : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. రేపు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR Will Announce MLA Candidates Tomorrow) ప్రకటన విడుదల చేస్తారని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితాలో 87 మంది పేర్లు ఉండొచ్చునని తొలుత భావించినా.. అవసరమైతే ఒకేసారి 100కు పైగా వెల్లడించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2022) 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన కేసీఆర్.. ఈసారి అదే సెంటిమెంట్‌ను అనుసరించవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వామపక్షాలతో పొత్తు ఉండక పోవచ్చునని బీఆర్​ఎస్​లో చర్చ జరుగుతోంది. తుది నిర్ణయం ప్రకటించకపోయినా.. సీపీఐ, సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై పార్టీ నాయకత్వం కొంత విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం కోరుతుండగా.. బీఆర్​ఎస్ అధిష్ఠానం దానికి సిద్ధంగా లేనట్లు సమాచారం. ఖమ్మం నేతలు మాత్రం కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించడం మేలనే అభిప్రాయాన్ని కేసీఆర్​కు చెప్పారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇప్పటి వరకు వామపక్ష నేతలతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదు. ఈ పొత్తుపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

BRS MLA Ticket Fight News : సిట్టింగ్ స్థానాల్లో పది వరకు మార్చవచ్చని తెలుస్తోంది. జనగామ, స్టేషన్ ఘన్​పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వేములవాడ, ఉప్పల్, వైరా తదితర స్థానాలపై ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్​రెడ్డి (MLA Muthireddy Vs Palla Rajeshwar Reddy in Jangaon), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆశిస్తున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం నియోజకవర్గంలో రాజకీయ రగడకు ఆజ్యం పోసింది. పల్లాకు టికెట్‌(Jangaon BRS Ticket Fight News) ఇవ్వొద్దంటూ ఆర్టీసీ చౌరస్తాలో ముత్తిరెడ్డి(MLA Muthireddy Yadagiri Reddy) వర్గీయులు నిన్న రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. జనగామలో పోటీ చేసేందుకు పల్లా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి నిన్న కంటతడి పెట్టారు.

BRS Candidates Fight for Assembly Tickets : అటు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దంటూ.. కడియం చేసిన వ్యాఖ్యలతో ఘన్‌పూర్‌ నిన్న భగ్గుమంది. వివిధ మండలాల్లో రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. వరంగల్‌-హైదరాబాద్‌ రహదారిపై రాజయ్య వర్గీయులు రాస్తారోకో చేశారు.భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియపై అసంతృప్తులు తిరుగుబావుటా ఎగురవేశారు. హరిప్రియకు టికెట్‌ ఇవ్వొద్దంటచూ.. ఇల్లందు మున్సిపల్‌ ఛైర్మన్‌ నివాసంలో పలు మండలాలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే భర్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ప్రతి అభివృద్ధి పనిలో కమీషన్లు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా టికెట్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఇస్తారన్న ప్రచారంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో మకాం వేసిన మదన్‌లాల్‌.. సీఎం అపాయిట్‌మెంట్‌ కోరినా లభించకపోవటంతో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను కలిసినా హామీ లభించలేదని తెలిసింది.

KTR on BRS MLA Candidate Tickets : 'వ్యక్తిగత అభిప్రాయాలు, కోరికలు పక్కనపెట్టి.. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలి'

Arguments of BRS Candidates for Assembly Tickets : నల్గొండ జిల్లా దేవరకొండ టికెట్‌ ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు ఇవ్వొద్దంటూ వివిధ మండలాలకు చెందిన నాయకులు మంత్రి హరీశ్‌రావును కలిశారు. అలాగే, బీఆర్ఎస్​ నేత, అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నాగార్జునసాగర్ టికెట్ ఆశిస్తున్నారు. కేసీఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగర్ టికెట్ తనదేనని.. బన్నీ ప్రచారానికి వస్తారని కంచర్ల చంద్రశేఖర్​రెడ్డి ధీమాతో ఉన్నారు.

BRS Focus On Telangana Assembly Elections 2023 : ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి ప్రచారమే ప్రారంభించగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాశ్​రెడ్డి, బల్దియా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎవరికి వారే టికెట్‌పై విశ్వాసంతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిని దించాలని బీఆర్ఎస్​ నాయకత్వం దాదాపు నిర్ణయించింది. గోషామహల్‌లో నియోజకవర్గ ఇంచార్జి నందకిషోర్ వ్యాస్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో.. ఆయన కుమార్తె లాస్య నందితను పోటీకి దించవచ్చునని పార్టీ శ్రేణుల అంచనా వేస్తున్నాయి. టీఎస్​ఎమ్​ఐడీసీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేశ్ సైతం టికెట్‌ ఆశిస్తున్నారు.

BRS MLA Tickets Telangana 2023 : వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఉండగా.. రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహారావు అధిష్ఠానం ఆశీస్సులు తనకేనని చెబుతున్నారు. ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మికి అవకాశం ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆత్రం సక్కుతో హరీశ్‌రావు చర్చించినట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్థానంలో తనకే టికెట్ ఇస్తారని భూక్యా జాన్‌సన్‌ నాయక్ ధీమాతో ఉన్నారు.

KTR on BRS MLA Candidate Fight : ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ టికెట్ల కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. అందరూ కలిసి పనిచేయాలని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. కేసీఆర్​ను మళ్లీ సీఎంను చేసే క్రమంలో.. వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పనిచేసి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ కోరారు.

MLA Muthireddy Yadagiri Reddy Fires on Palla : 'పల్లా రాజేశ్వర్​రెడ్డి కార్పొరేట్ పద్ధతిలో కుట్రలు చేస్తూ.. నా బిడ్డను, అల్లుడిని చెడగొట్టారు'

BRS Political War in Jangaon District : జనగామలో రోడ్డెక్కిన బీఆర్​ఎస్​ రాజకీయం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల తంటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.