ETV Bharat / state

BRS MLA Tickets Telangana 2023 : సీట్ల కోసం BRS నేతల ఫైట్లు.. కేసీఆర్ సాబ్ ఎవరికి 'ఊ అంటారు.. ఎవర్ని ఊఊ' అంటారో..?

author img

By

Published : Aug 19, 2023, 8:00 AM IST

BRS MLA Tickets Telangana 2023 : అసెంబ్లీ టికెట్ల కోసం బీఆర్​ఎస్​ నేతలు పోటాపోటీగా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు, మూడ్రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే సూచనలు ఉన్నందున.. ఆశావహుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కొన్ని నియాజకవర్గాల్లో తాడోపేడో అన్న రీతిలో నేతలు బలప్రదర్శనలకు దిగుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని ఓ వైపు అధినాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. జాబితా సిద్ధం చేసుకున్న పార్టీ నాయకత్వం.. ముఖ్య నేతలను పిలిచి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామంటూ నచ్చచెబుతోంది.

BRS Tickets
BRS Tickets Clashes in Telangana

BRS Tickets Clashes in Telangana టికెట్​ కోసం విశ్వప్రయత్నాలు.. నియోజకవర్గాల్లో రచ్చకెక్కుతున్న రాజకీయాలు

BRS MLA Tickets Telangana 2023 : బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ.. ఆశావహుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మరోవైపు పోటీ ఆశావహులు.. అధినేతను ఒప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 21న అభ్యర్థుల ప్రకటన(BRS MLA Candidates List 2023) ఉంటుందన్న జోరు ప్రచారంతో.. నేతలు ఎత్తులు, పైఎత్తులతో వేగం పెంచారు. ఎక్కువ స్థానాలను సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వనున్నట్లు బీఆర్​ఎస్​ సంకేతాలు ఇవ్వడంతో.. తమ సేవలను గుర్తించి తమకు ఈ సారి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గాల్లోని ఇతర నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

కొందరు సిట్టింగ్‌లను మార్చక తప్పదనే ప్రచారం ఉండటంతో.. జాబితాలో తమ పేరు ఉండేలా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు. సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు వంటి ముఖ్య నేతలను మెప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పోటాపోటీ ప్రయత్నాల నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. తమకు ఇవ్వాలని ఓ వైపు కోరుతూనే... ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ ద్వితీయ శ్రేణి నాయకులతో చెప్పిస్తున్నారు. కొందరు నేతలు తమ మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి.. అధిష్ఠానం ఆశీర్వాదం తమకే నంటూ పోటాపోటీ ప్రచారమే ప్రారంభించారు.

BRS MLA Tickets in Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థుల వడపోతపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్​ఎస్​ నాయకత్వం.. టికెట్లు రానివారికి నచ్చజెబుతోంది. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ముథోల్ స్థానాల్లో తర్జనభర్జన కొనసాగుతుండటంతో.. ఎమ్మెల్యేలను పిలిపించిన సీఎం... హరీశ్‌రావుతో కలిసి వారితో విడివిడిగా మాట్లాడినట్లు సమాచారం. ఖానాపూర్‌ నుంచి జాన్సన్‌ నాయక్‌, బోథ్‌ నుంచి జెడ్పీటీసీ అనిల్‌ జాదవ్, ఆసిఫాబాద్‌ నుంచి కోవా లక్ష్మిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

KTR On TS Elections 2023 : 'ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా BRS హ్యాట్రిక్​ ఖాయం'

Asifabad MLA Ticket 2023 : ఆసిఫాబాద్‌ నుంచి కోవా లక్ష్మి దాదాపుగా ఖరారైనందున.. ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఎంపీకి పోటీచేయించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బెల్లంపల్లి, ముథోల్ నియోజకవర్గాల నుంచి దుర్గం చిన్నయ్య, విఠల్ రెడ్డిలను పిలిపించినా వారిని మారుస్తారా? లేదా? అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సిర్పూర్‌లో కోనేరు కోనప్ప, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran Reddy) అభ్యర్థిత్వాలు మారే అవకాశాలు లేవు. చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై ప్రస్తుతానికి చర్చ వినిపించనందున... వాటిని రెండో విడత జాబితాలో వెల్లడించే అవకాశం ఉంది.

Ticket War in Jangaon : జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పోటీ రాజకీయం రచ్చకెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చే నియోజకవర్గాల్లో జనగామ ఒకటని విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా.. తనకే మళ్లీ టికెట్ అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెబుతున్నారు. ప్రగతి భవన్‌ సమీపంలోని హరితప్లాజాలో ఇటీవల పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని పలువురు ముఖ్య ప్రజా ప్రతినిధులు భేటీ కాగా.. మరుసటి రోజే మల్లాపూర్‌లో బలప్రదర్శన తరహాలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దతుదారులు సమావేశమయ్యారు

Station Ghanpur BRS Ticket Issue : అటు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం అధికార పార్టీలో మళ్లీ పంచాయితీ ముదిరింది. అధిష్ఠానం సర్దిచెప్పటంతో కడియం శ్రీహరి, రాజయ్య మధ్య కొన్నాళ్లుగా సద్దుమణిగిన మాటలయుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ నాదే అంటే ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా మార్పు జరిగితే తనకు అవకాశం లభిస్త్తుందని.. ఆశీర్వదిస్తే నిజాయతీగా పనిచేస్తానన్నారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలకు రాజయ్య ధీటుగా బదులిచ్చాడు. ఏ అర్హత లేకుండా కొందరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం సరికాదన్నారు

Vemulavawada Politics : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను మార్చి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నందున.. ఎమ్మెల్యే అనుచరులు సిరిసిల్లలో కేటీఆర్​ను కలిసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ జెడ్పీటీసీ సంధ్యారాణి, సింగరేణి కార్మిక సంఘం నేత మిరియాల రాజిరెడ్డి, మాజీ మేయర్ తదితరులు బహిరంగంగానే డిమాండ్ చేయగా... వారితో మాట్లాడిన కేటీఆర్ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని తొందరపడవద్దని చెప్పారు. పెద్దపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిలో.. మంథనిలో జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు బహిరంగంగా గళమెత్తారు.

BRS Candidates First List of 2023 Assembly Elections : త్వరలోనే BRS ఎమ్మెల్యే అభ్యర్థుల​ తొలి జాబితా..!

ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, సీనియర్ నాయకుడు బండారి (Uppal MLA Ticket) లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొంతు రామ్మోహన్ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) కారెక్కుతారన్న చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో అక్కడి బీఆర్​ఎస్​ నేతలు హరీశ్‌రావును కలిసి.. ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని కోరారు. చింతా ప్రభాకర్‌తో పాటు మరికొందరు టికెట్‌ ఆశిస్తుండగా.. నేతల అభిప్రాయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌ వారికి వివరించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇటీవల కందుకూరులో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న నేతలు సమావేశం నిర్వహించి కసిరెడ్డి నారాయణరెడ్డికే ఈసారి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అసమ్మతులు, అసంతృప్తులు బహిరంగం కావడంతో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్​రావు రంగంలోకి దిగారు (BRS MLA Tickets For 2023 elections). అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన పార్టీ నాయకత్వం.. ఆశావహులను ముందే పిలిచి మాట్లాడి.. భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని నచ్చచెబుతున్నారు. ఈ క్రమంలోనే తాండూరు నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కేసీఆర్ పిలిపించి మాట్లాడారు. తాండూరు టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికే ఇచ్చి.. భవిష్యత్తులో మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని మహేందర్‌రెడ్డికి నచ్చచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వైరాలో రాములు నాయక్, మదన్‌లాల్ మధ్య పోటీ ఉన్నందున.. తుది నిర్ణయంపై అధిష్టానం ఆచితూచి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌లను మార్చే నియోజకవర్గాల్లో ముథోల్, నర్సాపూర్‌ ఉందన్న ప్రచారం గుప్పుమనడంతో.. అక్కడి ఎమ్మెల్యేలు అప్రమత్తమై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

MLA Ticket Issue in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని, రామగుండం, చొప్పదండి నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు వ్యతిరేకంగా పలువురు నాయకులు మాట్లాడుతు. టికెట్ ఇస్తే సహకరించబోమంటూ సమావేశాలు పెట్టుకోవడం, నాయకులను కలవడం జరగ్గా, చొప్పదండి నాయకులతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్, ఇతర నియోజకవ ర్గాల నేతలతో పార్టీలోని ముఖ్యులు చర్చించి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్‌లను మార్చాలని ఆయా ప్రాంతాల నాయకులు సమావేశాలు జరిపి.. పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తులు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రగతిభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఒప్పించేందుకు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని పార్టీ నాయకత్వం నేతలకు చెబుతోంది. అందరికీ ఇప్పుడే అవకాశాలు ఇవ్వలేమని.. భవిష్యత్తులో కచ్చితంగా న్యాయం చేస్తామని ముఖ్య నేతలకు సర్దిచెప్పుతున్నారు.

Voter Registration Training Program : 'ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం లో ఉండే విధంగా చూడాలి.. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.