ETV Bharat / state

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

author img

By

Published : Jun 27, 2020, 3:03 PM IST

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రెవెన్యూ, దేవాదాయ భూములపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ శాఖతో జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల రక్షణ చ‌ర్య‌ల‌పై కేటీఆర్ సమీక్షించారు.

ktr
ktr

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ, దేవాదాయ భూములపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల రక్షణ చ‌ర్య‌ల‌పై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో చ‌ర్చ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సమీక్షించారు.

ప్రభుత్వ స్థలాలకు జియో పెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలి. ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అర్హులైన పేదలకు జీవో నంబర్ 58, 59 ద్వారా భూముల క్రమబద్ధీకరించి వారికి భూ హక్కులు కల్పించాం. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

లీజ్‌లను సమీక్షించండి

ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ శాఖతో జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. దశాబ్దాల కింద తీసుకున్న లీజ్‌లను సమీక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లీజ్ నియమ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌ కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.