ETV Bharat / state

Nehru zoo park : జూపార్క్‌లో పక్షుల ఎవియరీని ప్రారంభించిన ఇంద్రకరణ్‌ రెడ్డి

author img

By

Published : Dec 23, 2021, 7:56 PM IST

Nehru zoo park: హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రూ.కోటి 33 లక్షలతో... పక్షుల ఎవియరీని ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. పక్షి ప్రేమికులను ఆకట్టుకునేలా జూపార్కులో సహజసిద్దంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లను ప్రారంభించారు.

minister indrakaran reddy
minister indrakaran reddy

Nehru zoo park : హైదరాబాద్​లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో రూ.1.33కోట్లతో నూతనంగా పక్షుల ఎవియరీని ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్‌క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించే అరుదైన పక్షిజాతికి చెందిన 680రకాల పక్షులు ఇందులో ఉంచామని మంత్రి తెలిపారు. జంతు ప్రదర్శనశాలకు వచ్చే సందర్శకుల కోసం ఎప్పటికప్పుడు నూతన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

వైల్డ్‌ డాగ్స్‌ ఎన్​క్లోజర్​ ప్రారంభించిన మంత్రి
వైల్డ్‌ డాగ్స్‌ ఎన్​క్లోజర్​ ప్రారంభించిన మంత్రి

సీసీ కెమెరాల ఏర్పాటు

minister indrakaran reddy: జంతు ప్రదర్శనశాలలో భద్రత వ్యవస్థను మెరుగుపరచడం, నిరంతర పర్యవేక్షణ, సందర్శకుల కదలికలు, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం కోసం 200సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. రెండో దశలో మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సెంట్రల్‌ జూ అథారిటీ, జపాట్ నిధులతో 1.6 కోట్లు వెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.

కొత్తగా వచ్చిన వైల్డ్​ డాగ్స్​

జంతు ప్రదర్శనశాలలోకి కొత్తగా ధోలేగా పిలువబడే 4 వైల్డ్‌ డాగ్స్‌ను తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. వీటిని జంతుమార్పిడి పద్ధతిలో కర్ణాటకలోని పిలికుల బయోలాజికల్ పార్కు, మంగళూరు నుంచి తీసుకు వచ్చామని వీటికోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహదూర్‌పుర ఎమ్మెల్యే మౌజమ్‌ ఖాన్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ, జూ పార్క్‌ క్యూరేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Minister Harish Rao: ప్రభుత్వాలు వ్యాపారాత్మక ధోరణితో పనిచేయకూడదు: హరీశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.