ETV Bharat / state

TS weather Report: ఉపరితల ఆవర్తన ప్రభావం.. రానున్న మూడురోజులు వర్షాలు

author img

By

Published : Nov 4, 2021, 3:17 PM IST

TS weather Report
తెలంగాణలో వర్ష సూచన

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు(TS rains) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.

రాష్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(TS rains) అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ రోజు రాష్ట్రంలోకి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ(TS weather Report) పేర్కొంది. నిన్న కొమరిన్‌ ప్రదేశం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం(TS weather Report) ఈ రోజు బలహీనపడిందని వెల్లడించింది.

ఇదీ చదవండి: Diwali Precautions: కొవిడ్​ బాధితులు టపాసులు కాలుస్తున్నారా? బీకేర్​ఫుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.