ETV Bharat / state

Left parties on BRS MLAs List 2023 : 'కేసీఆర్​కు బీజేపీతో దోస్తీ కుదిరింది.. అందుకే ఈ మోసం'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2023, 5:48 PM IST

Updated : Aug 22, 2023, 8:37 PM IST

Left parties on BRS MLAs List 2023 : బీఆర్​ఎస్​ అసెంబ్లీ ఎన్నికల అభర్థుల ప్రకటనలో సీఎం కేసీఆర్​ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. బీఆర్​ఎస్​తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా కేసీఆర్​ను దూషించమని విధానపరంగా తేల్చుకుంటామని స్పష్టం చేశాయి. వచ్చే ఎన్నికల్లో శక్తికి మించి కృషి చేసి.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని కమ్యూనిస్టు నేతలు కూనంనేని, తమ్మినేని అన్నారు.

CPI Kunamneni on BRS MLAs Candidates
Left parties on BRS MLAs List 2023

Left parties on BRS MLAs List 2023 కేసీఆర్​కు బీజేపీతో దోస్తీ కుదిరింది.. అందుకే ఈ మోసం

CPI Kunamneni on BRS MLAs Candidates : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను ఓడించడమే తమ లక్ష్యమని వామపక్షాలు (Left parties) స్పష్టం చేశాయి. బీజేపీతో కేసీఆర్​కు సఖ్యత ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీఆర్​ఎస్​కు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్​ఎస్​తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించమని... విధానపరంగా మాత్రం వ్యతిరేకిస్తామని కూనంనేని స్పష్టం చేశారు.

కేసీఆర్​ కనీసం మిత్రధర్మం పాటించలేదని కూనంనేని దుయ్యబట్టారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం కేసీఆర్​ ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని.. ఎన్నికల్లో గెలవడానికి తుదివరకు పోరాడుతామని తెలిపారు. కమ్యూనిస్టుల (Communists Telangana) సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. తమతో విభేదించడం వలన నష్టపోయేది కేసీఆరే తప్ప తాము కాదని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎంలో ఎటువంటి గొడవలు లేకుండా కలిసే పనిచేస్తున్నాయని వివరించారు.

"బీజేపీ ప్రమాదం కాదా? కేసీఆర్ మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీజేపీతో బీఆర్​ఎస్​కు మిత్రత్వం ఏర్పడిందా?. అసలు కేసీఆర్.. మిత్రధర్మం పాటించరా? రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్​ఎస్​ ఏమయ్యేది. బీజేపీ అండదండలుంటే చాలని మీరనుకుంటున్నారు."- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

CPM Tammineni on BRS Candidates List : అభ్యర్థుల ప్రకటించడంలో కేసీఆర్​ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేసీఆర్‌ నిర్ణయం తాము ఊహించని పరిణామంగా చెప్పుకొచ్చారు. మునుగోడు ఎన్నికలో కేసీఆరే తమ పొత్తు కోరారని.. ఎన్నిక తర్వాత కూడా వామపక్షాలు తమ మిత్రపక్షాలని కేసీఆర్‌ చెప్పారని అన్నారు. సీట్ల సంఖ్యపై బీఆర్​ఎస్​తో వామపక్షాలకు పేచీలేదని.. రాజకీయ వైఖరిలో తేడావల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలనేది తమ నిర్ణయమని.. ఆ పార్టీతో వ్యతిరేక వైఖరి వల్లే ఇండియా కూటమితో ఉన్నట్లు తమ్మినేని పేర్కొన్నారు.

"భవిష్యత్​లో అన్ని ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్, కేటీఆర్ చెప్పారు. సీట్ల సమస్య కాదు.. కేసీఆర్ రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చింది. రాష్ట్రంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్​తో కొట్లాడుతుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్​తో ఎలా పని చేస్తామని బీఆర్​ఎస్​ నేతలు అన్నారు. ఇండియా కూటమితో దగ్గరగా ఉన్నామనే ఉద్దేశంతో కేసీఆర్ పొత్తు వద్దు అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాం"- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

BRS Party Campaign Strategy 2023 : హ్యాట్రిక్ కొట్టడమే ధ్యేయంగా.. కేసీఆర్ ప్రచార వ్యూహ రచనలు షురూ!

'బీజేపీ హఠావో.. దేశ్ ​కో బచావో' నినాదంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు: కూనంనేని

Last Updated : Aug 22, 2023, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.